T.Congress : గజ్వేల్‌లో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.

10TV Telugu News

Dalit Dandora Sabha : సెప్టెంబర్‌ 17 సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఇలాఖాలాలో దండోరా మోగించేందుకు రెడీ అయ్యింది కాంగ్రెస్‌. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతకుముందు ఆగస్టు 9న క్విట్‌ ఇండియా ఉద్యమ దినం సందర్భంగా ఇంద్రవెల్లిలో తొలి దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభను నిర్వహించారు. అనంతరం రావిర్యాల, మూడుచింతలపల్లిలో సభలు సక్సెస్‌ చేశారు. చివరి సభను గజ్వేల్‌ పట్టణంలో నిర్వహించనున్నారు.

Read More : ZPTC MPTC Results : 19న పరిషత్‌ కౌంటింగ్‌.. అదే రోజు ఫలితాలు

ఇంటిగ్రేటెడ్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌ వద్ద గల మైదానంలో జరగనున్న సభకు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జునఖర్గే ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నారు. ఈ సభకు లక్ష మంది వస్తారన్న అంచనాతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు హస్తం పార్టీ నేతలు. సభను విజయవంతం చేసేందుకు దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ శ్రేణులు శ్రమిస్తున్నాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లాతో పాటు  జనగాం, మేడ్చల్‌ – మల్కాజిగిరి, నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల నుంచి ప్రజలను సభకు తరలించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.

Read More : Airtel Prepaid: ఎయిర్‌టెల్ యూజర్లకు ఐపీఎల్ స్పెషల్ ప్యాక్

రాష్ట్రంలోని 36 వేల బూత్‌లను నుంచి జనసమీకరణ చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పార్టీ శ్రేణులకు ఇప్పటికే పిలుపునిచ్చారు. ఒక్కో బూత్‌ నుంచి కనీసం 9మంది తగ్గకుండా వచ్చేలా చూడాలని జిల్లా అధ్యక్షులను ఆదేశించారు. సీఎం సొంత నియోజకవర్గంలో జరుగుతున్న ఈ సభకు భారీగా జనసమీకరణ చేసి సత్తా చాటాలని భావిస్తోంది హస్తం పార్టీ. మరి ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.