Dandora Sabha : 17వ తేదీన గజ్వేల్‌లో దండోర సభ

గజ్వేల్‌లో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర సభ కోసం కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈ నెల 17న జరిగే ఈ  సమావేశాన్ని మరింత సక్సెస్ చేసేందుకు ప్రయత్నాలు జరుపుతోంది.

Dandora Sabha : 17వ తేదీన గజ్వేల్‌లో దండోర సభ

Dandora Sabha In Gajwel On The September 17th

Dandora Sabha : గజ్వేల్‌లో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర సభ కోసం కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈ నెల 17న జరిగే ఈ  సమావేశాన్ని మరింత సక్సెస్ చేసేందుకు ప్రయత్నాలు జరుపుతోంది. శనివారం జరిగిన టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్  కమిటీ సమావేశంలోనూ దీనిపై చర్చించారు. గజ్వేల్‌ సభను గ్రాండ్ సక్సెస్‌ చేసేందుకు నాయకులందరికీ దిశానిర్దేశం చేశారు రేవంత్‌రెడ్డి. టీపీసీసీ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో.. పీసీసీ ముఖ్య నేతలు హాజరయ్యారు. ఇందులో గజ్వేల్‌  సభ, హుజురాబాద్ అభ్యర్థితో పాటు పీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశంపైనా చర్చించారు.

Read More : Hussain Sagar : గణేష్ నిమజ్జనం ఎక్కడ ? అంతా గందరగోళం

గజ్వేల్ దండోర సభకు  అతిథుల ఆహ్వానం కోసం మధుయాష్కీ, భట్టి విక్రమార్కకు బాధ్యతలు అప్పగించారు రేవంత్‌రెడ్డి. అలాగే సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు గాంధీ భవన్‌లో పీసీసీ కార్యవర్గ సమావేశం జరపాలని నిర్వహించారు. ఈ సమావేశానికి  టీపీసీసీ కార్యవర్గంతో పాటు.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర సీనియర్ నేతలందరూ హాజరుకావాలన్నారు. అలాగే  రాష్ట్రంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, అమలు చేస్తున్న పథకాల అంశాలపై, పీసీసీ భవిష్యత్తు కార్యాచరణపైనా  సమావేశంలో చర్చించనున్నారు.

Read More : Weather Update: అలెర్ట్.. నేడు, రేపు భారీ వర్షాలు!

టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశానికి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డుమ్మా కొట్టడం కలకలం రేపుతోంది.  హుజురాబాద్ అభ్యర్ధి ఎంపిక ఆలస్యం కావడంపై జగ్గారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దండోరా సభ  హుజురాబాద్‌లో ఎందుకు పెట్టడం లేదని ఆయన ప్రశ్నిస్తున్నారు. పొలిటికల్‌ ఆఫైర్స్‌ కమిటీ సమావేశాలకు ఎమ్మెల్యేలు, ఎంపీలను ఆహ్వానించాలని గతంలోనే సూచించినా, ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన  అడిగినట్టు తెలుస్తోంది. తమను సంప్రదించకుండా కమిటీలను వేస్తున్నారని.. ఢిల్లీ పర్యటనకు ఎంపీ, ఎమ్మెల్యేలను  పిలవకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. సీనియర్ నేతలను దూరం పెట్టడం సరైన పద్దతి కాదని జగ్గారెడ్డి  అభిప్రాయపడ్డారు.