Dasara : దసరా ఎంజాయ్, రూ. 222.23 కోట్ల లిక్కర్, 50 లక్షల చికెన్ సేల్!

దసరా పండుగను.. నగర వాసులు ఫుల్ ఎంజాయ్ చేశారు. మద్యం అమ్మకాలు భారీస్థాయిలో జరగడంతో ఎక్సైజ్ ఖజానా గల్లుగల్లుమంది.

10TV Telugu News

Liquor Sales Rs. 222 Crore : దసరా పండుగను.. నగర వాసులు ఫుల్ ఎంజాయ్ చేశారు. కరోనా కాలంగా దసరా పండుగను ఇంట్లోనే జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈసారి పరిస్థితుల్లో మార్పు రావడంతో…ఈ ఫెస్టివల్ ను కుటుంబసభ్యులు, బంధుమిత్రుల మధ్య జరుపుకున్నారు. చిన్నా..పెద్దా అనే తేడా లేకుండా పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ పండుగ రోజున వచ్చిందంటే చాలు..ముక్క లేనిదే ముద్ద దిగదు అంటారు. మద్యం అలవాటు ఉన్న వారు సంగతి చెప్పనక్కర్లేదు. ఏ ఇంట్లో చూసినా మాంసం ఘుమఘుమలతో సంబరాలు అంబరాన్నంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే..ఆనందోత్సహాలతో నగరం వెల్లివిరిసింది.

Read More : WBBL Game : వాట్ ఏ క్యాచ్..అమ్మాయి పట్టిన క్యాచ్‌కు నెటిజన్లు ఫిదా

మద్యం అమ్మకాలు భారీస్థాయిలో జరగడంతో ఎక్సైజ్ ఖజానా గల్లుగల్లుమంది. కేవలం వారం రోజుల్లో రూ. 222.23 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. ఈనెల 12వ తేదీ నుంచి 14వ తేదీ మధ్య కేవలం మూడు రోజుల్లోనే…సుమారు రూ. 75 కోట్ల మద్యం సేల్స్ అయ్యాయంటే..మద్యం బాబులు ఏ రేంజ్ లో కొనుగోలు చేశారో అర్థమౌతుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 7.78 లక్షల కేసుల లిక్కర్, మరో 2.36 లక్షల కేసుల బీర్లు అమ్ముడైనట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.

Read More : Mobile Phones Stolen: రూ.7కోట్ల విలువైన సెల్ ఫోన్లు చోరీ

ఇక చికెన్ సేల్స్ కూడా అదే విధంగా ఉన్నాయి. పొద్దున్నే సంచి తీసుకుని చికెన్, మటన్ షాపుల మందు వాలిపోయారు. దీంతో మాంసం దుకాణాలు ఫుల్ రష్ తో నిండిపోయాయి. గ్రేటర్ పరిధిలో ప్రతి రోజు 10 లక్షల కిలోల చికెన్ విక్రయాలు జరుగుతుంటాయని అంచనా. గురు, శుక్రవారాల్లో దాదాపు 50 లక్షల చికెన్ విక్రయాలు జరినట్లు హోల్ సేల్ వ్యాపారులు వెల్లడిస్తున్నారు. దసరా ఫెస్టివల్ సందర్భంగా మటన్ కంటే..చికెన్ వైపు నగర వాసులు మొగ్గు చూపడంతో సేల్స్ హై రేంజ్ లో దూసుకపోయాయని వెల్లడిస్తున్నారు. మటన్ కిలో రూ. 750 నుంచి 800 ఉండడం కూడా ఒక కారణమని చెప్పవచ్చు. గత మూడు రోజుల్లో…దాదాపు 10 నుంచి 15 లక్షల కిలోల మటన్ విక్రయాలు జరిగి ఉంటాయని అంచనా. మొత్తంగా దసరా పండుగను చుక్క, ముక్కతో పసందు చేసుకున్నారు.