Dead body : మృతదేహాలు తారుమారు – బాధలో గుర్తించని బంధువులు

నిజామాబాద్ లో కరోనాతో చనిపోయిన మృతదేహాలు మారిపోయి, ఒకరికి బదులు ఇంకోకరికి అంత్యక్రియలు నిర్వహించారు. పొరపాటు గుర్తించిన తర్వాత తమ సంబంధీకురాలి మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీలోనే వదిలేసి వెళ్లిపోయారు.

Dead body : మృతదేహాలు తారుమారు – బాధలో గుర్తించని బంధువులు

Dead Bodies Exchange

Dead bodies exchange, funeral for one dead body : కరోనా వైరస్ విలయతాండవం చేయటంతో మృతుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. కొన్నిచోట్ల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించటానికి గంటల కొద్దీ సమయం పడుతోంది. నిజామాబాద్ లో కరోనాతో చనిపోయిన మృతదేహాలు మారిపోయి, ఒకరికి బదులు ఇంకోకరికి అంత్యక్రియలు నిర్వహించారు. పొరపాటు గుర్తించిన తర్వాత తమ సంబంధీకురాలి మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీలోనే వదిలేసి వెళ్లిపోయారు.

కొద్ది రోజుల క్రితం నిజామాబాద్ కు చెందిన మహిళ కరోనాతో ప్రభుత్వాసుపత్రిలో జాయిన్ అయ్యారు. అదే సమయంలో పక్క జిల్లాకు చెందిన ముస్లిం మహిళ కూడా కరోనతో ఆస్పత్రిలో జాయిన్ అయ్యింది. చికిత్స పొందుతూ ఇద్దరూ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. కోవిడ్ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది మొఖాలు కనపడేట్టుగా కవర్లలో చుట్టి వాటిని మార్చురీలో భద్రపరిచారు.

మృతదేహాలను బంధువులకు అప్ప చెప్పేటప్పుడు ముఖ భాగాలను తొలగించి చూపించాకే సంబంధీకులకు అప్పగిస్తారు. ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియదు కానీ….. నిజామాబాద్ జిల్లా వాసులు పక్క జిల్లాకు చెందిన ముస్లిం మహిళ మృతదేహం తీసుకువెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు.

పక్క జిల్లాకు చెందిన ముస్లిం మహిళ బంధువులు శుక్రవారం ఆస్పత్రికి చేరుకున్నారు. సిబ్బంది చూపించిన మృతదేహం చూసి ఖంగుతిన్నారు. అది తమకు చెందిన మహిళ మృతదేహం కాదని వారు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈవిషయం అధికారుల వద్దకు వెళ్లింది. తర్జన భర్జనల అనంతరం మార్చురీలో ఉన్నది నిజామాబాద్ కు చెందిన మహిళ మృతదేహం గా నిర్ధారించుకున్నారు.