secunderabad: డెక్కన్ మాల్ బిల్డింగ్‌లో మళ్లీ అంటుకున్న మంటలు.. ఆలస్యం కానున్న కూల్చివేత

అధికారులు కూల్చివేత పనులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గురువారం ఈ పనులు చేపడుతుండగా బిల్డింగ్‌లో మళ్లీ మంటలు అంటుకున్నాయి. బిల్డింగ్ కూల్చేందుకు వినియోగిస్తున్న భారీ క్రేన్‌లో ఆయిల్ లీకైంది. ఈ కారణంగా బిల్డింగులో మళ్లీ మంటలు అంటుకున్నాయి.

secunderabad: డెక్కన్ మాల్ బిల్డింగ్‌లో మళ్లీ అంటుకున్న మంటలు.. ఆలస్యం కానున్న కూల్చివేత

secunderabad: సికింద్రాబాద్, రాంగోపాల్ పేటలోని డెక్కన్ మాల్ బిల్డింగ్‌లో మరోసారి మంటలు అంటుకున్నాయి. దీంతో కూల్చివేత పనులు ఆలస్యం కానున్నాయి. డెక్కన్ మాల్ బిల్డింగ్ ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అగ్ని ప్రమాద ఘటనలో ఈ భవనం పూర్తిగా దెబ్బతింది. ఈ భవనాన్ని పరిశీలించిన అధికారులు దీన్ని కూల్చివేయాలని తేల్చారు.

Republic Day parade: భారత గణతంత్ర వేడుకల్లో ఈజిప్ట్ ఆర్మీ.. తొలిసారి పరేడ్ నిర్వహించిన సైన్యం

దీంతో అధికారులు కూల్చివేత పనులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గురువారం ఈ పనులు చేపడుతుండగా బిల్డింగ్‌లో మళ్లీ మంటలు అంటుకున్నాయి. బిల్డింగ్ కూల్చేందుకు వినియోగిస్తున్న భారీ క్రేన్‌లో ఆయిల్ లీకైంది. ఈ కారణంగా బిల్డింగులో మళ్లీ మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, బిల్డింగ్ వద్దకు చేరుకుని మంటలు ఆర్పేస్తున్నారు.

బిల్డింగ్ కూల్చివేత పనులు చేపట్టేందుకు నిర్వాహకులు మరో భారీ క్రేన్ తెప్పించే ప్రయత్నాల్లో ఉన్నారు. వీలైతే హై రీచ్ భూమ్ వెహికల్‌ను తెప్పిస్తామని కూల్చివేత పనులు పర్యవేక్షిస్తున్న ఏజెన్సీ చెప్పింది. ఏది ముందు వస్తే దానితో పనులు చేపట్టేందుకు ఏజెన్సీ ప్రయత్నిస్తోంది. దీంతో బిల్డింగ్ కూల్చివేత పనులు మరింత ఆలస్యం కానున్నాయి.