Instagram : ప్రేమించలేదని ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్య పోస్టులు

ప్రేమించలేదని కక్ష పెంచుకొని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అసభ్య పోస్టులు చేశాడు. యువతి ఫిర్యాదుతో కటకటాలపాలయ్యాడు.

Instagram : ప్రేమించలేదని ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్య పోస్టులు

Instagram

Instagram : ప్రేమించలేదని కక్ష పెంచుకొని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అసభ్య పోస్టులు చేశాడు. యువతి ఫిర్యాదుతో కటకటాలపాలయ్యాడు. వివరాల్లోకి వెళితే నల్గొండ జిల్లాకు చెందిన గంజి దీపక్ కుమార్ 2019లో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేశాడు. అక్కడే ఓ యువతితో పరిచయం ఏర్పడింది.

Read More : Love : ముక్కోణపు ప్రేమకథను లాటరీలో పరిష్కరించిన పెద్దలు

పరిచయం స్నేహంగా మారింది. ఇదే సమయంలో యువతి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా యూజర్‌ఐడీ, పాస్‌వర్డు తెలుసుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకు ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకోవాలని యువతిని కోరాడు.. అందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో యువతిపై కక్షపెంచుకున్న దీపక్ బ్లేమ్ చెయ్యాలని అనుకున్నాడు.

Read More : Love Marriage: అబ్బాయికి 16.. ఆమెకి 19.. పెళ్ళైన 6 గంటలకే పెటాకులు!

సదరు యువతి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను ఓపెన్ చేసి అసభ్య పోస్టులు చేశాడు. స్నేహితుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఆమె రాచకొండ పోలీసులను ఆశ్రయించింది. సీపీ మహేష్‌ భగవత్‌ ఆదేశాలతో.. ఏసీపీ హరినాథ్‌, డీసీపీ యాదగిరి పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ ప్రకాశ్‌ సాంకేతిక ఆధారాలను సేకరించి నిందితుడు దీపక్‌ను అరెస్టు చేశారు.