Degree Classes : సెప్టెంబర్ 1 నుంచి క్లాసులు ప్రారంభం

సెప్టెంబర్ 1 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. డిగ్రీ ప్రవేశాలు, తరగతుల నిర్వహణపై ఉన్న విద్యామండలి చర్చించగా, డిగ్రీ కాలేజీల్లో 180 రోజులు పనిదినాలు జరపనున్నట్లు తెలిపింది.

Degree Classes : సెప్టెంబర్ 1 నుంచి క్లాసులు ప్రారంభం

Degree Classes

Degree Classes : సెప్టెంబర్ 1 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. డిగ్రీ ప్రవేశాలు, తరగతుల నిర్వహణపై ఉన్న విద్యామండలి చర్చించగా, డిగ్రీ కాలేజీల్లో 180 రోజులు పనిదినాలు జరపనున్నట్లు తెలిపింది. తొలి సెమిస్టర్ కు 90 రోజులు, రెండో సెమిస్టర్ కు 90 రోజుల పాటు బోధన జరగనుండగా వచ్చే ఏడాది జనవరి/ఫిబ్రవరిలో తొలి సెమిస్టర్, జూన్/జూలైలో రెండో సెమిస్టర్ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రంలోని ఆరు యూనివర్సిటీలలో సెప్టెంబర్ 1 నుంచి డిగ్రీ మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభం కానున్నాయి.

ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన వైస్ ఛాన్సలర్ల సమావేశంలో ఆరు యూనివర్సిటీల పరిధిలో అమలు చేయనున్న కామన్ అకడమిక్ క్యాలెండర్‌ను ఆమోదించారు. ఈ సమావేశంలో దోస్త్ ప్రవేశాల ప్రక్రియ, అకడమిక్ అంశాలపై చర్చించారు. ఈ విద్యాసంవత్సరం పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ పీజీసెట్‌ను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. ఆరు యూనివర్సిటీలలో పీహెచ్‌డీలలో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని, పరీక్ష తర్వాత పీహెచ్‌డీ ప్రవేశాలలో అనుసరించాల్సిన విధానాలను అధ్యయనం చేయడానికి ఒక కమిటీని నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. నాలుగు కళాశాలల్లో బీఏ ఆనర్స్‌ను పైలట్ ప్రాజెక్టుగా తీసుకురావాలని, ఉస్మానియా యూనివర్సిటీ ఈ ప్రోగ్రాంను పర్యవేక్షించి కరికులమ్‌ను డిజైన్ చేసేందుకు చొరవ తీసుకోవాలని నిర్ణయించారు.

మొదటి సెమిస్టర్ షెడ్యూల్
2021, సెప్టెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభం
2021, అక్టోబర్ 9 నుంచి 17 వరకు షార్ట్ వెకేషన్
2021, అక్టోబర్ 18 నుంచి వెకేషన్ తర్వాత పునఃప్రారంభం
2021, నవంబర్ 10 నుంచి 12 వరకు మొదటి ఇంటర్నల్ పరీక్షలు
2021, డిసెంబర్ 21 నుంచి 23 వరకు రెండవ ఇంటర్నల్ పరీక్షలు
2022, జనవరి 12 తరగతులకు చివరి రోజు
2022, జనవరి 13 నుంచి 23 వరకు ప్రిపరేషన్ సెలవులు, ప్రాక్టికల్ పరీక్షలు
2020, జనవరి 24 నుంచి ఫిబ్రవరి 16 వరకు మొదటి సెమిస్టర్ పరీక్షలు

రెండవ సెమిస్టర్ షెడ్యూల్
2022, ఫిబ్రవరి 17 నుంచి తరగతులు ప్రారంభం
2022, ఏప్రిల్ 6 నుంచి 8వరకు మొదటి ఇంటర్నల్ పరీక్షలు
2022,మే 11 నుంచి 12 వరకు రెండవ ఇంటర్నల్ పరీక్షలు
2022, జూన్ 8 తరగతులకు చివరి రోజు
2022, జూన్ 9 నుంచి 16 వరకు ప్రిపరేషన్ సెలవులు, ప్రాక్టికల్ పరీక్షలు
2022, జూన్ 17 నుంచి జులై 8 వరకు రెండవ సెమిస్టర్ పరీక్షలు