Singareni workers : సింగరేణి కార్మికులకు గ్రాట్యూటీ గ్రాంట్ ఎప్పుడో?

దేశానికి వెలుగులు అందిస్తున్న సింగరేణి కార్మికుల జీవితాలు మాత్రం అంధకారంలోనే మగ్గుతున్నాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా వాళ్లకు రావల్సిన బెన్ ఫిట్స్ కోసం ఇప్పటికీ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

Singareni workers : సింగరేణి కార్మికులకు గ్రాట్యూటీ గ్రాంట్ ఎప్పుడో?

Delay In Implementation Of Gratuity For Singareni Workers

Delay in implementation of gratuity for Singareni workers : దేశానికి వెలుగులు అందిస్తున్న సింగరేణి కార్మికుల జీవితాలు మాత్రం అంధకారంలోనే మగ్గుతున్నాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా వాళ్లకు రావల్సిన బెన్ ఫిట్స్ కోసం ఇప్పటికీ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అధికారులకు ఒక రూలు, కార్మికులకు మారో రూలు ఉండడంతో ఆర్థిక దోపిడీకి గురవుతూనే ఉన్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేసిన కార్మికులను.. పదవి విరమణ తర్వాత పట్టించుకోవడం మానేశారు.

సింగరేణి కార్మికులకు గ్రాట్యుటీ విషయంలో ఇప్పటికీ నష్టం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ జారీలో జాప్యం జరగడమే ఇందుకు కారణం. 7వ వేతన కమిటీ సిఫారసు మేరకు కార్మికులకు 2016 నుంచే గ్రాట్యూటీ అమలు చేయాలన్నారు. అయితే దేశవ్యాప్తంగా బొగ్గు గనుల్లో గ్రాట్యుటీ పెంచుతూ 2017లో కోల్ ఇండియా యాజమాన్యం ముందుకు వచ్చినప్పటికీ కేంద్ర నుంచి నోటిఫికేషన్ జారీ కాకపోవడంతో అది అక్కడితోనే ఆగిపోయింది. గ్రాట్యూటీ కోసం సింగరేణి కార్మికులు నిరాశగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు 2018 నుంచి పదవీ విరమణ పొందిన వేలాది కార్మికులకు ఆర్థికంగా నష్టం జరుగుతోంది.

2017 అక్టోబర్ నుంచే గ్రాట్యుటీని పెంచాలని వేతన సవరణ కమిటీ ఒప్పందంలో యాజమాన్యం, కార్మిక సంఘాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో వేలాది మంది పదవి విరమణ పొందుతుండడంతో వారికి పెంచిన గ్రాట్యుటీ అందకుండా పోతుంది. సింగరేణి అధికారులతో సమానంగా కార్మికులకు పెంచిన గ్రాట్యుటీని అందించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. సంవత్సరాలు గడుస్తున్నా.. గ్రాట్యుటీ పెంచే విషయంలో కేంద్ర నుంచి గానీ, సింగరేణి సంస్థ నుంచి గానీ ఇప్పటివరకు స్పష్టత రాలేదు.

7వ వేతన కమిటీ సిఫారసుతో పాటు సతీష్ చంద్ర కమిషన్ సూచన ప్రకారం కేంద్ర ప్రభుత్వం గెజిట్ జారీ చేయాల్సి ఉంది. ఒక వైపు రాత పూర్వక ఒప్పందాలు జరుగుతున్నా.. అమలులో మాత్రం స్పష్టత రాకపోవడంతో కార్మికులు ఆవేదన చెందుతున్నారు. వెంటనే కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖతో పాటు సింగరేణి అధికారులు గ్రాట్యుటీని 20 లక్షలకు పెంచేలా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కార్మికులు వేడుకుంటున్నారు. మరి కార్మికుల ఆవేదనకు అధికారులు ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడుతారో వేచి చూడాలి.