MLC Kavitha : ఉత్కంఠకు తెర.. డేట్ ఫిక్స్ చేసిన సీబీఐ, ఈ నెల 11న కవిత వివరణ

MLC Kavitha : ఉత్కంఠకు తెర.. డేట్ ఫిక్స్ చేసిన సీబీఐ, ఈ నెల 11న కవిత వివరణ

MLC Kavitha : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వివరణకు సీబీఐ డేట్ ఫిక్స్ చేసింది. ఈ నెల 11న కవిత వివరణ తీసుకోనుంది. కవితతో 11న సమావేశానికి అంగీకారం తెలిపిన సీబీఐ.. ఈ మేరకు ఈ-మెయిల్ ద్వారా కవితకు సమాచారం ఇచ్చింది. వివరణ కోసం ఎమ్మెల్సీ కవిత అడిగిన ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో.. 11వ తేదీకి సీబీఐ అంగీకారం తెలిపింది. సీబీఐ విచారణలో ఎలాంటి విషయాలు వెల్లడవుతాయనేది ఆసక్తికరంగా మారింది.

ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సంబంధించిన కేసులో వివరణ కోసం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో ఈ నెల 11న సమావేశం కావడానికి సీబీఐ అంగీకరించింది. వివరణ కోసం ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో తన నివాసంలో అందుబాటులో ఉంటానని, అందులో అనువైన రోజున తనతో సమావేశం కావచ్చని సీబీఐకి కవిత లేఖ రాసిన విషయం విదితమే. కవిత లేఖకు సీబీఐ రిప్లయ్ ఇచ్చింది. 11వ తేదీన హైదరాబాద్ లోని కవిత నివాసంలో 11 గంటలకు భేటీ అవుతామని, స్టేట్ మెంట్ నమోదు చేస్తామని ఈ-మెయిల్ ద్వారా సమాధానం ఇచ్చింది సీబీఐ. సీబీఐ రిప్లయ్ తో.. ఉదయం నుండి సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితను సీబీఐ విచారిస్తుందా లేదా అనే ఉత్కంఠకు తెర పడింది.

Also Read.. Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆ ముగ్గురు సీఎంల పాత్ర ఉంది..ఎవ్వరు తప్పించుకోలేరు : తరుణ్ చుగ్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 6న విచారణకు రావాలని లేఖ రాసింది. అయితే కేంద్ర హోంశాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ కాపీని తనకు అందించాలని కోరుతూ కవిత సీబీఐకి లేఖ రాశారు. దానికి స్పందించిన అధికారులు ఈ-మెయిల్‌ ద్వారా సమాధానం ఇస్తూ ఎఫ్‌ఐఆర్‌ కాపీ వెబ్‌సైట్‌లో ఉందని తెలిపారు. దీనిపై న్యాయనిపుణులతో చర్చించిన అనంతరం సీబీఐకి కవిత లేఖ రాశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న నిందితుల పేర్లు సహా అన్ని అంశాలను పరిశీలించానని, అందులో తన పేరు ఎక్కడా లేదన్నారు. ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల ఈ నెల 6న సీబీఐ అధికారులను కలుసుకోలేనని చెప్పారు. ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో మీకు అనువైన ఏదైనా ఒక రోజు హైదరాబాద్‌లోని మా నివాసంలో సమావేశం కావడానికి అందుబాటులో ఉంటానని, దర్యాప్తునకు సహకరించడానికి పైన పేర్కొన్న తేదీల్లో ఒక రోజు సమావేశమవుతానని లేఖలో తెలిపారు కవిత. త్వరగా తేదీని ఖరారు చేయాలని కోరారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, దర్యాప్తునకు సహకరిస్తానని సోమవారం మెయిల్‌ ద్వారా సీబీఐకి కవిత లేఖ పంపారు. ఈ క్రమంలో కవిత లేఖపై సీబీఐ కాస్త లేటుగా స్పందించినప్పటికీ.. రిప్లయ్ రావడంతో ఉత్కంఠకు తెర పడినట్లు అయ్యింది.

Also Read..MLC Kavitha: ఎఫ్ఐఆర్‌లో నా పేరు లేదు.. రేపు విచారణకు హాజరుకావటం లేదు.. సీబీఐకి ఎమ్మెల్సీ కవిత మరో లేఖ