Delhi Liquor Policy Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు.. అధికారుల అదుపులో హైదరాబాద్ రియల్టర్

బంజారాహిల్స్ లో ప్రముఖ స్థిరాస్తి వ్యాపారి వన్నమనేని శ్రీనివాసరావు ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు.. తర్వాత ఆయనను ఈడీ కార్యాలయానికి తరలించారు.

Delhi Liquor Policy Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు.. అధికారుల అదుపులో హైదరాబాద్ రియల్టర్

Delhi Liquor Policy Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించి హైదరాబాద్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ ఉప్పల్ లోని సాలిగ్రామ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అటు మాదాపూర్ లోని వరుణ్ సన్ సంస్థలోనూ ఈడీ తనిఖీలు కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి బంజారాహిల్స్ లో ప్రముఖ స్థిరాస్తి వ్యాపారి వన్నమనేని శ్రీనివాసరావు ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు.. తర్వాత ఆయనను ఈడీ కార్యాలయానికి తరలించారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే మూడు సార్లు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇవాళ ఢిల్లీ నుంచి వచ్చిన మరో 6 బృందాలు ఆరు చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేశారు. కొన్ని చోట్ల తనిఖీలు ముగిశాక వారిని నేరుగా ఈడీ కార్యాలయానికి పిలిపించుకుని విచారిస్తున్నారు.

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు జరుగుతున్నాయి. మొత్తం పది చోట్ల ఈడీ బృందాలు సోదా చేస్తున్నాయి. 3 ఐటీ కంపెనీలతో పాటు 2 రియల్‌ ఎస్టేట్‌ ఆఫీసుల్లో సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన పది మంది ప్రత్యేక అధికారుల బృందం ఈ సోదాలు నిర్వహిస్తోంది. కరీంనగర్‌కు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి నివాసంతో పాటు రామంతాపూర్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌ తదితర ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పలు రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 16న దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 40 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. ఢిల్లీతో పాటు పంజాబ్‌, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని ఆయా ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఢిల్లీకి చెందిన ఈడీ అధికారులు 25 బృందాలుగా ఏర్పడి బెంగళూరు, చెన్నై, నెల్లూరు, హైదరాబాద్‌లోని పలువురి ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేపట్టారు.

మద్యం పాలసీ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది. మూడు నెలల క్రితం మనీలాండరింగ్‌ కేసులో ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌ను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ విచారణ సందర్భంగా సత్యేంద్ర తెలిపిన సమాచారం మేరకు లిక్కర్‌ స్కామ్‌లో అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ అంశంపై ఇప్పటికే ఆగస్టులో కూడా వివిధ ప్రాంతాల్లో ఈడీ దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. ఢిల్లీ, హైదరాబాద్, నెల్లూరు, బెంగళూరు, మంగళూరు, చెన్నైలలో ఈడీ సోదాలు నిర్వహించింది.

ఇటీవలే హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా 40 చోట్ల మరోసారి సోదాలు నిర్వహించింది ఈడీ. బెంగళూరు, చెన్నై, ఏపీలోని నెల్లూరులో తనిఖీలు చేశారు. హైదరాబాద్‌లోని రాయదుర్గం సహా పలు ప్రాంతాల్లో సోదాలు చేశారు. ఢిల్లీకి చెందిన ఈడీ అధికారుల ఆధ్వర్యంలో 25 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి ఈడీ అధికారులు ఇప్పటికే హైదరాబాద్‌లో రెండు సార్లు తనిఖీలు నిర్వహించారు. దీంట్లో భాగంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో కూడా మూలాలు ఉన్నాయనే ఆరోపణలతో ఏపీ, తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ, లిక్కర్ వ్యాపార వేత్తల నివాసాలు కార్యాలయాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి.

కొన్నిరోజుల క్రితం హైదరాబాద్ నగర శివార్లలోని కోకాపేట్‌లోని రామచంద్ర పిళ్లై నివాసం, నానక్‌రామ్‌గూడలోని రాబిన్‌ డిస్టలరీస్‌ కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. రాబిన్‌ డిస్టలరీస్‌, రాబిన్‌ డిస్ట్రిబ్యూషన్స్‌ ఎల్‌.ఎల్‌.పి. పేరుతో రామచంద్ర పిళ్ల్లై కంపెనీలు నిర్వహిస్తున్నారు. తన సంస్థలో అభిషేక్‌ బోయిన్‌పల్లి, గండ్ర ప్రేమ్‌సాగర్‌రావును డైరెక్టర్లుగా ఆయన నియమించుకున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి హైదరాబాద్‌లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.