MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఈడీ మరో చార్జిషీట్‌లోనూ ఎమ్మెల్సీ కవిత పేరు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ మరో చార్జ్ షీట్ దాఖలు చేసింది. సమీర్ మహేంద్రపైన ఈడీ దాఖలు చేసిన ఈ చార్జిషీట్ లో సంచలన విషయాలు పేర్కొంది. మరోసారి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్లు చార్జిషీటులో ఉన్నాయి.

MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఈడీ మరో చార్జిషీట్‌లోనూ ఎమ్మెల్సీ కవిత పేరు

MLC Kavitha : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు తెరపైకి వచ్చింది. ఈ స్కామ్ లో ఈడీ మరో చార్జ్ షీట్ దాఖలు చేయగా, ఇందులోనూ కవిత పేరుని ప్రస్తావించారు ఈడీ అధికారులు. సమీర్ మహేంద్రపైన ఈడీ దాఖలు చేసిన ఈ చార్జిషీట్ లో సంచలన విషయాలు పేర్కొంది. మరోసారి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్లను ఈ చార్జిషీటులో ఈడీ పేర్కొంది. సమీర్ కంపెనీలో కవితకు వాటాలు ఉన్నట్లు కూడా ఈడీ వెల్లడించింది.

సమీర్‌ కంపెనీలో కవితకు 32శాతం వాటా ఉన్నట్లు అభియోగం మోపింది ఈడీ. సమీర్ మహేంద్రు ఛార్జ్ షీట్‌లో ఎమ్మెల్సీ కవిత, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, మూత్తం గౌతమ్, అరుణ్ రామచంద్ర పిళ్ళై, అభిషేక్ రావు పేర్లు ఉన్నాయి. ఒబెరాయ్ హోటల్ లో మాగుంట శ్రీనివాస్ రెడ్డి మీటింగ్ ఏర్పాటు చేసినట్టు ఈడీ విచారణలో పేర్కొన్నారు సమీర్ మహేంద్రు. శరత్ చంద్ర రెడ్డి, అభిషేక్, బుచ్చిబాబు ఢిల్లీ ఒబారాయ్ హోటల్ సమీర్ మహేంద్రు కలిసినట్టు ఈడీ ఛార్జ్ షీట్‌లో పేర్కొంది.

Also Read..MLC Kavitha: ఎలాంటి విచారణకైనా సిద్ధం.. ఎన్నికల ముందు ఈడీ, సీబీఐ కేసులు పెట్టడం బీజేపీకి కొత్తకాదు..

అనంతరం శరత్‌ చంద్రారెడ్డి సొంత ఫ్లైట్‌లో హైదరాబాద్‌ వెళ్లినట్లు ఈడీ పేర్కొంది. ఇండో స్పిరిట్స్‌లో ఎల్‌-1 కింద వచ్చిన షాపుల్లో కవితకు వాటా ఉందని, ఒబెరాయ్ హోటల్‌లో జరిగిన మీటింగ్‌లో కవిత, అరుణ్‌ పిళ్లై, దినేష్‌ అరోరా, విజయ్‌నాయర్‌ పాల్గొన్నట్లు చార్జ్‌షీట్‌లో ఈడీ పేర్కొంది. ఇండో స్పిరిట్‌ను కవిత వెనకుండి నడిపించారని చార్జ్‌షీట్‌లో ఈడీ తెలిపింది. ఇండో స్పిరిట్స్‌లో నిజమైన భాగస్వాములు కవిత, మాగుంట శ్రీనివాస్‌రెడ్డి అని చార్జ్‌షీట్‌లో ఈడీ వెల్లడించింది.

ఢిల్లీ లిక్కర్ మనీ లాండరింగ్ కేసు విచారణకు సంబంధించి ఈడీ దాఖలు చేసిన చార్జ్ షీటులో రాజకీయ ప్రముఖుల పేర్లు మరోసారి బయటపడ్డాయి. తెలంగాణ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ మాగుంట వ్రీనివాసులు రెడ్డిల పేర్లను చార్జిషీట్ లో ఈడీ ప్రస్తావించడం జరిగింది.

Also Read..Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆ ముగ్గురు సీఎంల పాత్ర ఉంది..ఎవ్వరు తప్పించుకోలేరు : తరుణ్ చుగ్

నవంబర్ 26వ తేదీన సమీర్ మహేంద్ర అతడికి సంబంధించిన నాలుగు కంపెనీలపైన 3వేల పేజీలతో ఈడీ తొలి చార్జిషీట్ ను దాఖలు చేసింది. ఇవాళ ఆ చార్జిషీట్ ను పరిగణలోకి తీసుకోవడం జరిగింది. తదుపరి విచారణను జవనరి 5వ తేదీకి వాయిదా పడింది. లిక్కర్ పాలసీ రూపకల్పనలో జరిగిన అవకతవకలు, దీని వెనుక ఎవరెవరు ఉన్నారు? ప్రభుత్వానికి ఎంత నష్టం వాటిల్లింది? అన్న అంశాలను చార్జిషీట్ లో పేర్కొంది ఈడీ.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.