Delhi Liquor Scam: ఢిల్లీకి బయల్దేరిన కవిత… కీలక సూచనలు చేసిన సీఎం కేసీఆర్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్, బంజారాహిల్స్ లోని తన ఇంటి నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకుని, అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరారు. అంతకు ముందు ఆమె సీఎం కేసీఆర్ తో మాట్లాడారు. "నీ కార్యక్రమం నువ్వు కొనసాగించు. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. బీజేపీ అకృత్యాలపై న్యాయపరంగా పోరాడదాం. నీకు పార్టీ అండగా ఉంటుంది" అని కవితకు కేసీఆర్ ఫోన్లో చెప్పారు.

Delhi Liquor Scam: ఢిల్లీకి బయల్దేరిన కవిత… కీలక సూచనలు చేసిన సీఎం కేసీఆర్

Delhi Liquor Scam

Delhi Liquor Scam: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్, బంజారాహిల్స్ లోని తన ఇంటి నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకుని, అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరారు. అంతకు ముందు ఆమె సీఎం కేసీఆర్ తో మాట్లాడారు. “నీ కార్యక్రమం నువ్వు కొనసాగించు. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. బీజేపీ అకృత్యాలపై న్యాయపరంగా పోరాడదాం. నీకు పార్టీ అండగా ఉంటుంది” అని కవితకు కేసీఆర్ ఫోన్లో చెప్పారు.

కాగా, ఢిల్లీ వెళ్లేముందు న్యాయవాదులు, పలువురు బీఆర్ఎస్ నేతలతో కూడా కవిత చర్చించారు. ఆమె ఎల్లుండి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దధర్నా చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నారు. రేపు విచారణకు రావాలని ఈడీ నోటీసులు పంపింది. విచారణకు మరోరోజు హాజరుకావాలని కవిత భావిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కవితకు ఈడీ నుంచి నోటీసులు అందడం వెనుక కుట్ర ఉందని అంటున్నారు.

కాగా, ఎల్లుండి భారత జాగృతి ఆధ్వర్యంలో నిరాహార దీక్షకు దిగుతామని ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే ప్రకటించారు. మహిళా బిల్లును వెంటనే అమలు చేయాలని అన్నారు. ఈ డిమాండ్ తో తాము చేస్తున్న దీక్షకు అన్ని రాష్ట్రాల్లోని ప్రతిపక్ష పార్టీలను, మహిళా నేతలను ఆహ్వానించామన్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు, మహిళా సమస్యలపై పోరాడుతున్న వారందరినీ ఆహ్వానించామని తెలిపారు. జనగణనను కూడా కేంద్రం వెంటనే చేపట్టాలని అన్నారు.

Delhi Liquor Scam: అందుకే కవితకు నోటీసులు పంపారు: తెలంగాణ మంత్రుల ఆగ్రహం