TRS Plenary : టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో వడ్డించే వంటకాలివే..

టీఆర్ ఎస్ ప్లీనరీలో రుచికరమైన వంటకాలు వడ్డించనున్నారు. వెజ్, నాన్ వెజ్ వంటకాలను తయారు చేస్తున్నారు. మీటింగ్ కు వచ్చే ప్రతినిధులకు 33 రకాల ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచనున్నారు.

TRS Plenary : టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో వడ్డించే వంటకాలివే..

Trs Food Items

Delicious food items : టీఆర్‌ఎస్‌ ద్విదశాబ్ధి ఉత్సవ వేడుక ప్లీనరీకి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.. హైదరాబాద్‌లోని హైటెక్స్‌ వేదికగా సోమవారం జరిగే ప్లీనరీ కోసం చకాచకా ఏర్పాట్లు చేస్తున్నారు.. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ ప్రతినిధులతో పాటు మొత్తం ఆరు వేల మంది తరలిరానున్నారు.

పార్కింగ్‌ నుంచి సభా వేదిక దాకా అన్ని ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.. పార్లమెంట్‌ సమావేశాలు, కరోనా కారణంగా మూడేళ్ల పాటు ప్లీనరీ సమావేశాలు జరగలేదు.. దీంతో ఈ సారి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి గులాబీ శ్రేణులు.. ఈ సమావేశాల్లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక కూడా జరగనుంది. 10వ సారి కూడా కేసీఆర్‌ను పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవడం లాంఛనం కానుంది.

Huzurabad Bypoll: హోటళ్లు ఫుల్.. ఆకాశానంటుతున్న ఇళ్ల అద్దెలు..!

మరోవైపు టీఆర్ ఎస్ ప్లీనరీలో రుచికరమైన వంటకాలు వడ్డించనున్నారు. వెజ్, నాన్ వెజ్ వంటకాలను తయారు చేస్తున్నారు. మీటింగ్ కు వచ్చే ప్రతినిధులకు 33 రకాల ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచనున్నారు. ధమ్ చికెన్ బిర్యాణి, మటన్ కర్రీ, నాటు కోడి పులుసు, ఎగ్ మసాలా, నల్లా పొడి ఫ్రై, మటన్ దాల్చా, బోటి ఫ్రై, పాయా సూప్, తలకాయ పులుసు, రుమాల్ రోటి, ఆలూ క్యాప్సికం, బగారా రైస్.

వెజ్ బిర్యాణి, వైట్ రైస్, మిర్చి కా సలాన్, గుత్తి వంకాయ, చామగడ్డ పులుసు, బెండకాయ కాజు ఫ్రై, పాలకూర మామిడికాయ పప్పు, పచ్చిపులుసు, ముద్దపప్పు, సాంబారు, ఉలవచారు+క్రీమ్, పెరుగు, పెరుగు చట్నీ, వెల్లుల్లి జీడిగుల్ల ఆవకాయ, వంకాయ చట్నీ, బీరకాయ టమోట చట్నీ, పాపడ్, వడియాలు, జిలేబీ, డబల్ కా మీటా, ఐస్ క్రీం.