Delta Plus : మహారాష్ట్రకు వెళుతున్నారా..అయితే జాగ్రత్త

మహారాష్ట్రకు వెళుతున్నారా ? అయితే జాగ్రత్త అంటున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే..అక్కడ డెల్టా కేసులు వెలుగుచూడడమే. మహారాష్ట్రలో సెకండ్‌ వేవ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా నమోదైంది. తాజాగా డెల్టా ప్లస్ కేసులు బయటపడ్డాయి. ఇప్పుడు ఇదే భయం నిజామాబాద్ జిల్లాను వెంటాడుతోంది. మహారాష్ట్ర సరిహద్దును జిల్లా ఆనుకొని ఉండ‌టం..నిత్యం రాక‌పోక‌లు కొనసాగడంతో డెల్టా ప్లస్ వ్యాప్తిపై టెన్షన్ మొదలైంది.

Delta Plus : మహారాష్ట్రకు వెళుతున్నారా..అయితే జాగ్రత్త

Delta

Delta Plus Cases : మహారాష్ట్రకు వెళుతున్నారా ? అయితే జాగ్రత్త అంటున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే..అక్కడ డెల్టా కేసులు వెలుగుచూడడమే. మహారాష్ట్రలో సెకండ్‌ వేవ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా నమోదైంది. తాజాగా డెల్టా ప్లస్ కేసులు బయటపడ్డాయి. ఇప్పుడు ఇదే భయం నిజామాబాద్ జిల్లాను వెంటాడుతోంది. మహారాష్ట్ర సరిహద్దును జిల్లా ఆనుకొని ఉండ‌టం..నిత్యం రాక‌పోక‌లు కొనసాగడంతో డెల్టా ప్లస్ వ్యాప్తిపై టెన్షన్ మొదలైంది.

ఇప్పటికే మ‌హ‌రాష్ట్రలో డెల్టా ప్లస్ వేరియంట్ 21 కేసులు నమోదయ్యాయి. డెల్టా ప్లస్ వేరియంట్ అత్యంత ప్రమాదకరమ‌ని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు అధికారులు. డెల్టా ప్లస్ వేరియంట్ మహారాష్ట్రలో బయటపడ్డప్పటికీ….నిజామాబాద్ జిల్లాలో దాని ప్రభావం ఇంకా లేదంటున్నారు అధికారులు. మహారాష్ట్ర వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. జిల్లాపై ప్రభావం చూపకుండా ఉండేందుకు మహారాష్ట్ర నుంచి వచ్చే వారికి బోర్డర్‌లో టెస్టులు చేస్తున్నామని జిల్లా ప్రధాన ప్రభుత్వాసుపత్రి సూపరెండెంట్ తెలిపారు.

మ‌హ‌రాష్ట్ర స‌రిహ‌ద్దుగా ఉండే బోద‌న్ డివిజ‌న్ కూడా అల‌ర్ట్ అయింది. డెల్టా వేరియంట్ వ్యాపించకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఫోకస్ చేశారు జిల్లా అధికారులు. అయితే ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని…కరోనా నిబంధనలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. డెల్టా ప్లస్ వ్యాపిస్తే జిల్లాలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.