ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ క్యాంపు కార్యాలయం కూల్చివేత

  • Published By: madhu ,Published On : September 17, 2020 / 11:41 AM IST
ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ క్యాంపు కార్యాలయం కూల్చివేత

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరంగల్ జిల్లా అతలాకుతలమైన సంగతి తెలిసిందే. దీనికి కారణం అక్రమ నిర్మాణాలే కారణం ప్రభుత్వం గుర్తించింది. వెంటనే మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగి..వరంగల్ జిల్లాలో పర్యటించారు. అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని సంబంధిత శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అధికారపక్షం, ప్రతిపక్షం నేతలను చూడవద్దని, ఎవరైనా అక్రమ నిర్మాణం అని తేలితే..వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.



ఈ నేపథ్యంలో హన్మకొండలోని హంటర్ రోడ్డులో నాలాపై నిబంధనలకు విరుద్ధంగా కట్టిన..అధికార వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ క్యాంపు కార్యాలయాన్ని 2020, సెప్టెంబర్ 16వ తేదీ బుధవారం ఉదయం అధికారులు కూల్చివేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
https://10tv.in/digging-graves-for-covid-19-victims-punishment-in-indonesia-for-not-wearing-masks/
ఈ సందర్భంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్రమ నిర్మాణాలు ఎవరు చేసిన కూల్చివేసుడేనంటూ..అధికారులు సమాధానం ఇచ్చినట్లైంది.



అక్రమ నిర్మాణాలను ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నారు. నాలాలపై అక్రమ నిర్మాణాలు చేపడితే..వారిపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. నగర కార్పొరేషన్ మేయర్ ఆధ్వర్యంలో అధికారులు నాలుగు నాలాలపై ఫోకస్ పెట్టారు. వీటిపై అక్రమ నిర్మాణాలు ఉంటే..కూల్చివేయాలని అధికారులు వెల్లడించారు.