IAS Smita Sabharwal : ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఇంట్లోకి అర్ధరాత్రి చొరబడ్డ డిప్యూటీ తహసీల్దార్

మహిళా ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఇంట్లోకి అర్ధరాత్రి డిప్యూటీ తహసీల్దార్ చొరబడటం తీవ్ర కలకలం రేపింది. ఉద్యోగ విషయం మాట్లాడేందుకు డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డి ఆమె ఇంట్లోకి ప్రవేశించారు. అతన్ని చూసిన స్మితా సబర్వాల్ కేకలు వేయడంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతన్ని పట్టుకున్నారు.

IAS Smita Sabharwal : ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఇంట్లోకి అర్ధరాత్రి చొరబడ్డ డిప్యూటీ తహసీల్దార్

Smita Sabharwal

IAS Smita Sabharwal : మహిళా ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఇంట్లోకి అర్ధరాత్రి డిప్యూటీ తహసీల్దార్ చొరబడటం తీవ్ర కలకలం రేపింది. ఉద్యోగ విషయం మాట్లాడేందుకు డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డి ఆమె ఇంట్లోకి ప్రవేశించారు. అతన్ని చూసిన స్మితా సబర్వాల్ కేకలు వేయడంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతన్ని పట్టుకున్నారు. డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆనంద్ కుమార్ రెడ్డితోపాటు అతడి స్నేహితుడు బాబును కూడా అరెస్టు చేశారు.

ఆనంద్ కుమార్ రెడ్డితోపాటు అతనితో వచ్చిన మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు. ఈ ఘటన రెండు రోజుల క్రితం చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో స్మితా సబర్వాల్ ఉండే ఇంటికి రాత్రి 11.30 గంటలకు డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డి కారులో వెళ్లాడు. తాను డిప్యూటీ తహసీల్దార్ అని చెప్పి, ఐఏఎస్ ను కలవాలంటూ ధైర్యంగా లోపలికి వెళ్లాడు.

HighCourt Shocks Smita Sabharwal : రూ.15లక్షలు తిరిగి ఇచ్చేయండి.. స్మితా సబర్వాల్‌కు హైకోర్టు షాక్

సెక్యూరిటీ సిబ్బంది సైతం అతన్ని లోపలికి వదిలారు. డోర్లు తట్టడంతో స్మితా సబర్వాల్ డోర్లు తెరిచింది. ఎవరని ప్రశ్నిస్తూ బయటికి వెళ్లాలని గట్టిగా కేకలు వేశారు. ఇక ఈలోపు భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. ఆనంద్ కుమార్ రెడ్డిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కారును సీచ్ చేసిన పోలీసులు డిప్యూటీ తహసీల్దార్ పాటు అతని స్నేహితుడు బాబును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

మరోవైపు ఘటన ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ స్పందించారు. ఆ రోజు రాత్రి భయమేసిందంటూ స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు. రాత్రి వేళల్లో డోర్ లాక్ ను ఒకటి రెండు సార్లు సరిచూసుకోవాలని ప్రజలకు సూచించారు. ఇక అవసరమైతే డయల్ 100 కు కాల్ చేయాలన్నారు.