Saidabad girl Rape case : నో డౌట్స్..రాజు ఆత్మహత్యపై ఎటువంటి అనుమానాలు లేవు : డీజీపీ

సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన రాజు ఆత్మహత్యపై ఎటువంటి అనుమానాలు లేవని..ఈ విషయాన్ని రాద్దాంతం చేయవద్దని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

Saidabad girl Rape case : నో డౌట్స్..రాజు ఆత్మహత్యపై ఎటువంటి అనుమానాలు లేవు : డీజీపీ

Saidabad Girl Child Rape

Saidabad girl child Rape: సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారిపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపిన ఘటనలో నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు పాలకొండ రాజు ఆత్మహత్యపై అతని కుటుంబ సభ్యులతో పాటు పలువురు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. రాజు ఆత్మహత్య ఘటన చర్చనీయాంశంగా మారింది. పోలీసులకే కావాలనే రాజును ఎన్ కౌంటర్ చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని నిందితుడు కుటుం సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాజు మృతిపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం లో రాజు మృతిని కస్టోడియల్ మృతిగా అనుమానం వ్యక్తం చేశారు. పోలీసుల అదుపులోనే రాజు చనిపోయినట్టుగా అనుమానాలున్నాయని ఈ పిటిషన్లో పేర్కొన్న విషయం కూడా తెలిసిందే.

Read more : HYD : సైదాబాద్ నిందితుడు రాజు ఆత్మహత్య

ఇటువంటి పలు అనుమానాలు తలెత్తున్న క్రమంలో రాజు ఆత్మహత్య ఘటనపై డీజీపీ మహేందర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రాజు ఆత్మహత్యపై ఎటువంటి అనుమానాలు లేవని స్పష్టంచేశారు. దీనిపై అనవసరంగా రాద్ధాంతాలు చేయవద్దని రాజు ఆత్మహత్య చేసుకున్న విషయం సుస్పష్టమని తెలిపారు. కానీ కొంతమంది దీనిపై అనవసరంగా వివాదాస్పంద చేస్తున్నారని ఎవరి వద్ద అయినా ఆధారాలు ఉంటే మాట్లాడండి తప్ప అనవసరంగా నిరాధారమైన వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు.

రాజు ఆత్మహత్య విషయంలో కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైలుకు చెందిన ఇద్దరు లోకో పైలట్లు, ఇద్దరు రైల్వే గ్యాంగ్ మెన్లు,మరో ముగ్గురు సాక్షులు ఉన్నారని తెలిపారు. సాక్షుల స్టేట్ మెంట్ వీడియో రికార్డింగ్ చేశామని వెల్లడించారు. ఇక రాజు ఆత్మహత్య విషయంలో రాద్దాంతాలు చేయవద్దని డీజీపీ మహేందర్ రెడ్డి సుస్పష్టం చేశారు.కాగా..సెప్టెంబర్ 9న సైదబాద్ సింగరేణి కాలనీలో చిన్నారిపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపింది. నిందితుడిని పట్టుకోవడానికి పోలీసు పలు బృందాలు రంగంలోకి దిగాయి. రాజుని పట్టిస్తే రూ.10లక్షలు బహుమతికూడా ప్రకటించారు పోలీసు అధికారులు. డేగ కళ్లతో రాజు కోసం అణువణువు గాలించాయి పోలీసు బృందాలు కానీ ఎక్కడా ఆచూకీ లభించలేదు.

Read more : Saidabad Raju Suicide : ఆ భయంతోనే రాజు ఆత్మహత్య చేసుకున్నాడు

ఈ క్రమంలో…వారం రోజులుగా పోలీసులకు భయపడి తప్పించుకుని తిరుగుతున్న రాజు గురువారం అంటే సెప్టెంబర్ 16న నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త తెలిసింది. ఘట్ కేసర్ – వరంగల్ ట్రాక్ పై రాజు మృతదేహం లభ్యమైంది. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేషన్ ఘన్ పూర్ వద్ద ఇతడి మృతదేహం గుర్తించారు. చేతిపై ఉన్న టాటూ ఆధారంగా రాజు అని నిర్ధారించారు.

Read more : Raju : ముగిసిన రాజు అంత్యక్రియలు.. ఆత్మహత్యగానే నిర్ధారణ

రాజు భయంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసు అధికారులు వెల్లడించారు. కానీ రాజుది ఆత్మహత్య కాదని పోలీసులే ఎన్ కౌంటర్ చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారనే పలు వార్తలు హల్ చల్ చేశాయి. ఈ క్రమంలో డీజీపీ రాజు ఆత్మహత్యపై క్లారిటీ ఇచ్చారు. రాజుది ఆత్మహత్యే దీన్ని రాద్ధాంతం చేయవద్దని స్పష్టం చేశారు.

Read more : Raju Suicide : పోలీసులే పరిగెత్తించి చంపేశారు.. రాజు తల్లి సంచలన ఆరోపణలు