Third Wave : థర్డ్ వేవ్ రాదు.. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ షురూ

తెలంగాణలో కొవిడ్, సీజనల్ వ్యాధుల ప్రస్తుత పరిస్థితిపై సీఎం కేసీఆర్ రివ్యూ సమావేశం నిర్వహించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. డెంగ్యూ ప్లేట్ లెట్స్ పై ప్రైవేట్ హాస్పిటల్

Third Wave : థర్డ్ వేవ్ రాదు.. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ షురూ

Third Wave

Third Wave : తెలంగాణలో కొవిడ్, సీజనల్ వ్యాధుల ప్రస్తుత పరిస్థితిపై సీఎం కేసీఆర్ రివ్యూ సమావేశం నిర్వహించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. డెంగ్యూ ప్లేట్ లెట్స్ పై ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ మొదలు పెట్టాయని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస రావు అన్నారు. ఏవైనా సమస్యలు తలెత్తితే 104 కి ఫిర్యాదు చేయవచ్చన్నారు. కొత్త వేరియంట్ వస్తే తప్పితే మన దగ్గర థర్డ్ వేవ్ వచ్చే అవకాశం లేదన్నారాయన. అలాగని ముప్పు తొలిగిపోలేదన్నారు. వ్యాక్సిన్, మాస్క్ తప్పనిసరి గా పాటించాల్సిందే అని తేల్చి చెప్పారు.

Inhaled Steroids : కరోనా బాధితులకు ఇన్‌హేలర్‌ స్టెరాయిడ్స్‌..!

ఇప్పటివరకు 613 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని డీహెచ్ శ్రీనివాస రావు తెలిపారు. హైదరాబాద్ లో అత్యధికంగా నమోదయ్యాయని చెప్పారు. మలేరియా కేసులు కూడా ఎక్కువగా ఉన్నాయన్నారు. కొత్తగూడెం, ములుగులో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయన్నారు. 2019లో డెంగ్యూ కేసులు 4వేలు రిపోర్ట్ అవగా.. ఈ ఏడాది సెప్టెంబర్ 10 వరకు 3వేల కేసులు నమోదైనట్టు వెల్లడించారు. వైరల్ ఫీవర్స్ కూడా ఎక్కువగా నమోదవుతున్నాయన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టామని డీహెచ్ తెలిపారు. ప్లేట్ లెట్ కౌంట్ పడిపోతే జనాలను ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు పెట్టిస్తున్నారని, వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని చెప్పారు. అక్టోబర్ నెలాఖరు వరకు కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ మినహా మిగతా జిల్లాల్లో చాలా తక్కువగా కేసులు నమోదు అవుతున్నాయన్నారు. రాష్ట్రంలో 0.4% మాత్రమే పాజిటివిటీ రేట్ ఉంటుందన్నారు.

Helmets Safety : హెల్మెట్లు ఇలా ధరిస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త!

తెలంగాణలో కొవిడ్ నియంత్రణలో ఉందని డీహెచ్ శ్రీనివాసరావు చెప్పారు. విద్యాసంస్థలు రీ ఓపెన్ అయ్యాయి కాబట్టి కేసులు ఎక్కువగా నమోదవుతాయిని అనుకున్నాము.. కానీ క్లస్టర్ బ్రేక్ ఎక్కడా చోటు చేసుకోలేదన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూల్స్ కి పంపొచ్చన్నారు. సెప్టెంబర్ లో పీక్ లోకి వెళ్తుంది, కేసులు విపరీతంగా పెరుగుతాయన్నారు. కానీ మన రాష్ట్రంలో అదుపులో ఉందని తెలిపారు. 27వేలకు పైగా ప్రభుత్వ బెడ్స్ మొత్తం ఆక్సిజన్ బెడ్స్ గా మార్చామన్నారు. భవిష్యత్ లో ఆక్సిజన్ అవసరం ఉంటే మనమే ఉత్పత్తి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

40% ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఆక్సిజన్ ప్లాంట్స్ తో సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో చిన్నారులకు ట్రీట్మెంట్ కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 3వేల 600 కు పైగా బెడ్స్ చిన్నారుల కోసం సిద్ధంగా ఉన్నాయన్నారు. మాస్క్ ధరించడం మానొద్దని, తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని డీహెచ్ శ్రీనివాసరావు సూచించారు.

రాష్ట్రంలో IT కంపెనీలు ప్రారంభించాలని తెలంగాణ ఆరోగ్య శాఖ కోరుతోందన్నారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని ఓపెన్ చెయ్యాలన్నారు.
రాష్ట్రంలో వ్యాక్సిన్ 2కోట్లకు చేరువలో ఉన్నామన్నారు. వ్యాక్సిన్ వల్ల మరణాల నుంచి తప్పించవచ్చన్నారు. వ్యాక్సిన్ తీసుకోని వారు వెంటనే తీసుకోవాలని డీహెచ్ శ్రీనివాస రావు విజ్ఞప్తి చేశారు.