ధరణి సేవలు స్టార్ట్

  • Published By: madhu ,Published On : November 2, 2020 / 02:24 PM IST
ధరణి సేవలు స్టార్ట్

Dharani services starting : తెలంగాణ వ్యాప్తంగా ధరణి సేవలు ప్రారంభమయ్యాయి. శంషాబాద్ తహసిల్దార్ కార్యాలయంలో ధరణి సేవలను సీఎస్‌ సోమేష్ కుమార్ 2020, అక్టోబర్ 02వ తేదీ సోమవారం ప్రారంభించారు. ధరణి సేవల ప్రక్రియను అధికారులకు వివరించారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆమయ కుమార్. హైదరాబాద్ మినహా 570 మండలాల్లో రైతులకు ధరణి సేవలు అందనున్నాయి.



ఈ నెల 29 న ధరణి రిజిస్ట్రేషన్లను ప్రారంభించారు సీఎం కేసీఆర్. ఈ ధరణి వెబ్‌సైట్‌లో ఇప్పటివరకు 1.48 లక్షల ఎకరాలకు సంబంధించిన 59.46 లక్షల ఖాతాలు నిక్షిప్తమయ్యాయి. సోమవారం రిజిస్ట్రేషన్‌ కోసం 946 మంది నగదు చెల్లించగా.. 888 మంది స్లాట్‌ బుక్‌ చేసుకున్నారు.



కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తున్నందున.. సెప్టెంబర్‌ 8 నుంచి తెలంగాణలో
భూముల క్రయవిక్రయాలను రాష్ట్రప్రభుత్వం నిలిపివేసింది. అవన్నీ గురువారం నుంచి మళ్లీ మొదలవుతాయి. ఇప్పటికే తహసీల్దార్లకు శిక్షణ ఇచ్చారు. రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్లను ట్రయల్స్ చేశారు. ధరణి పోర్టల్‌ అమలులోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో వ్యవసాయ భూమలు, ఇళ్ల భూముల సహా అన్ని రకాల రిజిస్ట్రేషన్లు దీని ద్వారానే జరుగుతాయని సీఎం కేసీఆర్ గతంలోనే స్పష్టం చేశారు.



https://10tv.in/telangana-dharani-portal-services-to-begin-from-dussehra-2020/
ఆస్తుల వివరాల నమోదు ప్రక్రియను అక్టోబర్ 15లోపు పూర్తి చేసి.. దసరా రోజున పోర్టల్‌ను ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. అయితే.. వర్షాలు, వరదల కారణంగా.. నమోదు ప్రక్రియకు ఆటంకం కలిగింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల వివ‌రాల నమోదు ప్రక్రియ వేగంగా జ‌రిగి‌నట్లు అధికారులు చెబుతున్నారు. రూర‌ల్ ఏరియాల్లో ఆస్తుల వివ‌రాలు సేకరించే బాధ్యతను పంచాయతీ కార్యదర్శలకు అప్పగించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మున్సిపల్ అధికారులు వివరాలు నమోదు చేశారు.



ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణలో 62.68 లక్షల ఇళ్లున్నాయి. అందులో సోమవారం నాటికి 58.40 లక్షల ఇళ్లకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేశారు. వరదల కారణంగా హైదరాబాద్‌లో ఆ ప్రక్రియ నెమ్మదిగా సాగింది. అగ్రికల్చర్ భూములకు సంబంధించి సమాచారం ఆన్‌లైన్‌లో ఉంది. పోర్టల్ ప్రారంభమైన తర్వాత కూడా నమోదు ప్రక్రియ కొనసాగనుంది. మరోవైపు.. రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన ఇళ్ల వివరాలను అధికారులు ధరణి పోర్టల్‌లో అప్‌లోడ్ చేయనున్నారు.