Viral Fever Symptoms : జ్వరం లక్షణాలతో ప్రజల్లో భయం భయం

ఏ జ్వరం వచ్చినా కరోనా అని భయపడిపోతున్నారు ప్రజలు. ప్రస్తుతం వస్తున్న జ్వరాలతో అటు డాక్టర్లు ఇటు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Viral Fever Symptoms : జ్వరం లక్షణాలతో ప్రజల్లో భయం భయం

Viral Fever Symptoms

Viral Fever Symptoms : ఏ జ్వరం వచ్చినా కరోనా అని భయపడిపోతున్నారు ప్రజలు. ప్రస్తుతం వస్తున్న జ్వరాలతో అటు డాక్టర్లు ఇటు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ మార్పులతో వస్తున్న సీజనల్ ఫీవర్ లక్షణాలు కరోనా లక్షణాలు ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. దీంతో తమకు కరోనా సోకిందని అపోహ పడుతున్నారు ప్రజలు. అయితే రోగి లక్షణాల ఆధారంగా ఏది కరోనా, ఏది డెంగీనో, ఏది వైరల్ ఫీవరో అంచనా వేయవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా, డెంగీ రెండూ వేర్వేరు వైరస్‌లు అయినప్పటికీ ఈ రెండింటిలో జ్వరం అనేది కామన్‌ సింప్టమ్‌. కానీ ఇవి చూపే ప్రభావం మాత్రం వేరు వేరుగా ఉంటాయి. కరోనా శ్వాసవ్యవస్థ పనితీరుపై ప్రభావం చూపితే.. డెంగీ రక్తంలోని ప్లేట్‌లెట్స్‌పై ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు.

Read More : Dengue Fever : ఏపీ లో పెరుగుతున్న డెంగీ కేసులు… అలర్టైన వైద్య ఆరోగ్య శాఖ

ఈ రెండింటికి ప్రత్యేక చికిత్స లేదని..సపోర్టింగ్‌ ట్రీట్‌మెంటే ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రధానంగా డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్నవారు ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. చికిత్సలో భాగంగా ఫ్లూయిడ్స్‌, యాంటీబాడీస్‌ మందులు ఇస్తారు. ప్లేట్‌లెట్స్‌ సంఖ్య 20 వేలకు పడిపోతే ప్లేట్‌లెట్స్‌ ఎక్కించాల్సి ఉంటుంది. రోగిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలి. కరోనాకి కూడా ప్రత్యేక చికిత్స అంటూ ఏమి లేదు..సపోర్టింగ్‌ ట్రీట్‌మెంటే ఉంది. ముఖ్యంగా శ్వాస సమస్య వచ్చిన రోగులకు ఆక్సీజన్‌ పెట్టడం, సమస్య తీవ్రంగా ఉంటే ఐసీయూలో పెట్టి వెంటిలెటర్‌పై ఉంచుతారు. వైరస్‌ ప్రభావంతో రోగిలో ఏర్పడే ఇతర అనారోగ్య సమస్యలకు అవసరమైన చికిత్స అందిస్తారు. జలుబు, జ్వరం, దగ్గుతో పాటు యాంటీబయాటిక్స్‌ ఇస్తారు.

Read More : Dengue Fever In GHMC Area : జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం – డెంగీ వ్యాధితో మహిళా డాక్టర్ మృతి

వైరల్ ఫీవర్ ను గుర్తించేందుకు సీబీపీ పరీక్ష చేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఇందులో న్యూట్రోఫిల్స్‌/ పోసైడ్స్‌(N/L)శాతం 2 కంటే తక్కువగా వస్తే సదరు రోగికి వైరల్‌ ఇన్‌ఫెక్షన్స్‌ ఉన్నట్లు గుర్తిస్తారు. అది ఏ రకమైన వైరల్‌ ఇన్‌ఫెక్షనో తెలుసుకునేందుకు ముందుగా యాంటీ బాడీ టెస్ట్‌, పీసీఆర్‌ పరీక్ష జరిపిస్తే ఏది కరోనానో ఏది డెంగీనో తేలిపోతుందని వైద్యులు చెబుతున్నారు.

 

డెంగీ ప్రధాన లక్షణాలు

ఇది దోమ కాటు వల్ల వస్తుంది
ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు
తీవ్రమైన తలనొప్పి
రక్తంలో ప్లేట్‌లెట్స్‌ సంఖ్య పడిపోతుంది
రన్నింగ్‌ నోస్‌ అంటే ముక్కు కారుతుంది
తీవ్రమైన జ్వరం ఉంటుంది.
రిట్రో ఆర్బిటాల్‌ పెయిన్‌
హ్యుమటోక్రైట్స్‌ తగ్గుతాయి
భరించలేని ఒంటినొప్పులు
చర్మంపై దద్దుర్లు వస్తాయి
కళ్లు ఎర్రబడతాయి

కరోనా ప్రధాన లక్షణాలు

ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అంటు వ్యాధి
జ్వరం సాధారణంగా ఉంటుంది
ఊపిరి ఇబ్బందిగా మారి శ్వాస సమస్య వస్తుంది.
చాలా మంది రుచి, వాసన కోల్పోతారు.
ఒంటి నొప్పులు ఉంటాయి కానీ అంత తీవ్రంగా ఉండవు
తలనొప్పి, కండ్లు ఎర్రబడటం
ముఖ్యంగా ముక్కు కారదు.
గొంతు నొప్పి ఉంటుంది.
కొంత మందిలో చర్మంపై ఎర్రని కురుపులు వస్తాయి.
దగ్గు, జలుబు ఉంటుంది.
ఆయాసం వస్తుంది.

వైరల్‌ ఫీవర్‌ లక్షణాలు
సాధారణ జ్వరం
గొంతు నొప్పి
సాధారణ దగ్గు
కీళ్లనొప్పులు (చికున్‌ గున్యాలో)
మూడు రోజులకు లక్షణాలు తగ్గిపోతాయి
ఆయాసం, శ్వాస సమస్య ఉండదు

డెంగీ, కరోనా వేరు వేరు వైరస్ ల ద్వారా వస్తాయి. ఈ రెండిటిలో కొన్ని లక్షణాలు ఒకేలా ఉంటాయి. రోగిలోని లక్షణాలను బట్టి అది కరోనా, లేదంటే డెంగీనా అని గుర్తించవచ్చని వైద్యులు చెబుతున్నారు.