HCA – Azharuddin: హెచ్‌సీఏలో రచ్చ.. గంగూలీకి లేఖ రాసిన అజారుద్దీన్

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మొహమ్మద్ అజారుద్దీన్.. హెచ్‌సీఏ సెక్రటరీ ఆర్ విజయానంద్ ఇతర సభ్యులతో వచ్చిన సమస్యలను బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ వరకూ తీసుకెళ్లారు. హెచ్‌సీఏ సభ్యులందరినీ ప్రస్తావిస్తూ..

HCA – Azharuddin: హెచ్‌సీఏలో రచ్చ..  గంగూలీకి లేఖ రాసిన అజారుద్దీన్

Hca Azharuddin

HCA – Azharuddin: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మొహమ్మద్ అజారుద్దీన్.. హెచ్‌సీఏ సెక్రటరీ ఆర్ విజయానంద్ ఇతర సభ్యులతో వచ్చిన సమస్యలను బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ వరకూ తీసుకెళ్లారు. హెచ్‌సీఏ సభ్యులందరినీ ప్రస్తావిస్తూ.. బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీకి మరో కాపీని బీసీసీఐ సెక్రటరీ జైషాకు, జస్టిస్ దీపక్‌కు పంపించారు.

కొందరు సభ్యుల కారణంగా ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ లో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అందులో పేర్కొన్నారు. ‘అసోసియేషన్ సెక్రటరీ పేరిట గుర్తింపు లేని లెటర్‌ను విజయానంద్ ఇష్యూ చేశారు. నాకు తెలిసి ఇక్కడ సెక్రటరీ పోస్టు అనేది అఫీషియల్ గా లేదని లెటర్ లో వెల్లడించారు.

2020 జూన్ 6న జరిగిన మీటింగ్ కు అనుగుణంగా నేను లెటర్ లో రాసిన అంశాలు అపెక్స్ కౌన్సిల్ అప్రూవ్ చేస్తుందని అనుకుంటున్నా. ఈ లెటర్ రాయడానికి మరో ఉద్దేశ్యం మూడు నెలలుగా బయటపెట్టని హెచ్‌సీఏ రికార్డుల్లో పొందుపరిచిన అంశాలను సురేంద్ర అగర్వాల్.. వెల్లడిస్తారని ఆశిస్తున్నా.

కొన్ని విషయాలను ఉద్దేశ్యపూర్వకంగానే ఎంకరేజ్ చేస్తూ.. అడ్మినిస్ట్రేషన్ కు ఆటంకం కలిగిస్తున్నారు. అసోసియేషన్ కార్యకలాపాలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ ఎవరనేది పూర్తి సమాచారంతో తెలియజేస్తారని ఆశిస్తూ మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నా’అని లెటర్ లో రాశారు.