రోడ్లమీద వాడిపారేస్తున్న మాస్క్‌లు, గ్లౌజ్‌‌లతో హైదరాబాద్‌కు ప్రమాదం. అర్ధమవుతోందా?

  • Published By: vamsi ,Published On : June 11, 2020 / 05:57 AM IST
రోడ్లమీద వాడిపారేస్తున్న మాస్క్‌లు, గ్లౌజ్‌‌లతో హైదరాబాద్‌కు ప్రమాదం. అర్ధమవుతోందా?

తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండడం.. టెన్షన్ పుట్టిస్తుంటే మరోవైపు వాడేసిన మాస్క్‌లు, గ్లౌజ్‌లను జనం రోడ్లపైనే పడేయడం మరింత ఆందోళనగా మారింది. మాస్క్‌లు, గ్లౌజ్‌లు వినియోగించిన తర్వాత సురక్షిత పద్ధతుల ద్వారా మాస్కులను డిస్పోజ్ చేయాలన్న సర్కార్ ఉత్తర్వులను జనం పట్టించుకోవట్లేదు. ఒక ట్విట్టర్ ఖాతాదారుగు గత వారం ఉపయోగించిన ముసుగులు మరియు చేతి తొడుగులతో నిండిన రహదారి చిత్రాలను పోస్ట్ చేయగా.. ఆ పోస్ట్ వైరల్‌గా మారింది. 

లాక్ డౌన్ సమయంలో కాస్త తక్కువగా కనిపించినప్పటికీ సడలింపులు ఇచ్చిన క్రమంలో రోడ్లపై ఎక్కువగా మాస్క్‌లు, గ్లౌజ్‌లు కనిపిస్తున్నాయి. ఏ రోడ్డుపై చూసినా మాస్కులు, గ్లౌజ్‌లు కనిపిస్తున్నాయి. కాస్త ఏమరపాటుగా ఉంటే.. మహమ్మారి కరోనా వైరస్ సోకకుండా ప్రజలను కాపాడుతున్న మాస్కులు, గ్లౌజులే వైరస్ వాహకాలుగా మారే ప్రమాదం ఉందని అంటున్నారు. కరోనాను కట్టడి చేసే చర్యలో భాగంగా ఇంట్లోంచి బయటకు వచ్చే ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

లాక్‌డౌన్ సడలింపులు ఇవ్వడంతో హైదరాబాద్ నగరంలో అయితే.. మాస్కులను వినియోగించిన తర్వాత డిస్పోజ్ చేయాలన్న ప్రభుత్వం ఉత్తర్వులను పాటించట్లేదు. పారిశుద్ధ్య కార్మికులు ఊడ్చిన అనంతరం రిక్షాల ద్వారా చెత్తను ఏరేస్తుంటే.. రిక్షాల నుంచి మళ్లీ వీటిని డబ్బాలో వేసి డంపింగ్ యార్డులకు పంపిస్తుంటారు. విచ్చలవిడిగా వాడేసిన మాస్కులు రోడ్లపై పడేయడం ప్రమాదకరం అవుతుండగా.. మాస్క్‌లు ఎక్కువగా కనిపిస్తుండడంపై పారిశుద్ధ్య కార్మికులు కూడా భయపడుతున్నారు. 

ఆసుపత్రుల్లో పీపీఈ కిట్‌లను పారవేసేందుకు ప్రోటోకాల్ ఉంది. అలాగే మాస్క్‌లకు కూడా. కానీ,  రోడ్లపై జనం నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు నిపుణులు.  ఒక్కసారి వాడిన  మాస్క్‌లపై 13 రోజుల పాటు వైరస్ జీవించి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read: తెలంగాణలో 3 బల్బులు, ఒక ఫ్యాన్ ఉన్న ఇంటికి రూ.7లక్షల కరెంటు బిల్లు