దీక్షిత్ మర్డర్ కేసు : డింగ్ టాక్ యాప్ వాడిన సాగర్, రిమాండ్ రిపోర్టులో ఆసక్తికర విషయాలు

  • Published By: madhu ,Published On : October 23, 2020 / 11:20 AM IST
దీక్షిత్ మర్డర్ కేసు : డింగ్ టాక్ యాప్ వాడిన సాగర్, రిమాండ్ రిపోర్టులో ఆసక్తికర విషయాలు

Dixit murder case: Manda Sagar used dingtalk app : దీక్షిత్ కిడ్నాప్ కేసు రిమాండ్ రిపోర్ట్‌లో ఆసక్తికర విషయాలు చేర్చారు పోలీసులు. నిందితుడు మంద సాగర్‌ ఏడాదికాలంగా డింగ్ టాక్ వాయిస్ అనే యాప్ వాడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అదే యాప్‌తో దీక్షిత్‌ పేరెంట్స్‌కి కాల్ చేసి రూ. 45 లక్షలు డిమాండ్ చేశాడు సాగర్. మొబైల్‌ నెంబర్‌తో కాకుండా యాప్‌ కాల్ చేయడంతోనే నిందితుడు ఆలస్యంగా దొరికాడని రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు పోలీసులు.



ఇంటిముందు ఆడుకుంటున్న దీక్షిత్‌.. సాగర్‌ పిలవగానే వెళ్లాడు. తెలిసిన వ్యక్తి కావడంతో వెంటనే వెళ్లి బైక్‌పై కూర్చున్నాడు. అక్కడి నుంచి నేరుగా పెట్రోల్‌ బంక్‌ వెళ్లాడని అక్కడ మంచినీళ్లు తాగుదామని సాగర్ బైక్‌ని ఆపాడు. అప్పటికే ఓ మెడికల్‌ షాప్‌లో రెండు స్లీపింగ్ పిల్స్ కొన్నాడు సాగర్.



https://10tv.in/why-sagar-kidnapped-and-killed-deekshith/
వాటిని మంచినీళ్లలో కలిపి దీక్షిత్‌కు తాగించాడు. మంచినీళ్లు తాగగానే దీక్షిత్‌ మత్తులోకి జారుకున్నాడు. బాలుడు స్పృహలోకి రాకముందే అతన్ని సాగర్ చంపేసినట్టు పోలీసులు రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. బాలుడ్ని చంపేసిన తర్వాత ఇంటర్నెట్ ప్రోటోకాల్‌ తో దీక్షిత్ పేరెంట్స్‌కి కాల్ చేసి డబ్బు డిమాండ్ చేశాడు సాగర్. చౌరస్తా దగ్గరికి క్యాష్‌ బ్యాగ్‌తో రావాలని సూచించాడు.

రంజిత్ క్యాష్‌ బ్యాగ్‌ వస్తున్నాడా లేదా అన్నది తన షాప్‌ నుంచే గమనించాడు. ఇక దీక్షిత్‌ను హత్య చేసిన సాగర్.. ఇంట్లో పరిస్థితి, తల్లిదండ్రుల రియాక్షన్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. మొత్తానికి డబ్బు డిమాండ్‌ చేయకముందే దీక్షిత్‌ను సాగర్‌ చంపేసినట్టు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు పోలీసులు.



2020, అక్టోబర్ 18వ తేదీ ఆదివారం సాయంత్రం ఇంటిముందు ఆడుకుంటున్న దీక్షిత్‌ను మంద సాగర్‌ తీసుకెళ్లాడు.
మెకానిక్ సాగర్‌కు సీసీ కెమెరాలపై పూర్తి అవగాహన ఉంది. దీంతో అవి లేని ప్రాంతం నుంచి పిల్లాడిని ఎత్తుకెళ్లాడు.
పిల్లాడి గొంతు నులిమి చంపేశాడు. పెట్రోల్‌ పోసి తగలబెట్టాడు. ఆ తర్వాతే తల్లిదండ్రులతో బేరసారాలు మొదలుపెట్టాడు.



ఫేక్‌ కాల్‌ యాప్‌ ద్వారా వారితో మాట్లాడాడు. మూడు రోజుల తర్వాత 2020, అక్టోబర్ 22వ తేదీ గురువారం పోలీసులు కేసును ఛేదించారు.
కృష్ణకాలనీలో మెకానిక్‌గా సాగర్ పనిచేసేవాడు. వచ్చే సంపాదనతో సంతృప్తి చెందకుండా లగ్జరీ లైఫ్‌ కావాలని కోరుకున్నాడు. అందుకే దీక్షిత్‌ను కిడ్నాప్ చేశాడని పోలీసులు తెలిపారు.