Yasangi Paddy : యాసంగిలో వరి పంట వేయాలా? వద్దా? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

తెలంగాణలో యాసంగి వరి పారాబాయిల్డ్ రైస్ కే అనుకూలం. రైతులు యాసంగిలో వరి వేయొద్దు. విత్తన కంపెనీలు, మిల్లర్లతో ఒప్పందాలున్న వారు మాత్రమే వరి వేయొచ్చు. వరి పంట సొంత రిస్క్ తో..

Yasangi Paddy : యాసంగిలో వరి పంట వేయాలా? వద్దా? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

Yasangi Paddy

Yasangi Paddy : యాసంగిలో వరి పంట వేయాలా? వద్దా? అనే గందరగోళ పరిస్థితి నెలకొంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. పౌర స‌ర‌ఫ‌రాల శాఖ అధికారుల‌తో ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి సోమేశ్ కుమార్ స‌మీక్ష నిర్వహించారు. ఈ స‌మావేశానికి అన్ని జిల్లాల క‌లెక్టర్లు, సీపీలు, ఎస్పీలు, వ్యవ‌సాయ శాఖ అధికారులు హాజరయ్యారు. యాసంగిలో వరి పంట వేయొద్దని సీఎస్ స్పష్టం చేశారు.

UAN-Aadhar Link : పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. వెంటనే ఆ పని చేయండి.. లేదంటే డబ్బులు రావు

”పారా బాయిల్డ్ బియ్యం తీసుకోవద్దని కేంద్రం, ఎఫ్‌సీఐ నిర్ణయించాయి. తెలంగాణలో యాసంగి వరి పారాబాయిల్డ్ రైస్ కే అనుకూలం. రైతులు యాసంగిలో వరి వేయొద్దు. విత్తన కంపెనీలు, మిల్లర్లతో ఒప్పందాలున్న వారు మాత్రమే వరి వేయొచ్చు. వరి పంట సొంత రిస్క్ తో వేసుకోవచ్చు. ఇతర రాష్ట్రాల ధాన్యం రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి” అని సీఎస్ చెప్పారు.

Microsoft Free Trick : ఈ ట్రిక్‌తో MS Office సాఫ్ట్‌వేర్ ఉచితంగా యాక్సస్ చేసుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

వానా కాలం పంటను కొనేందుకు అవసరమైతే కొనుగోలు కేంద్రాలు పెంచాలని సూచించిన ఆయన.. కలెక్టర్లు ఎక్కడా సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రోక్యూర్ మెంట్ సెంటర్లను విజిట్ చేయాలన్నారు. ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణకి ధాన్యం రాకుండా నియంత్రించాలన్నారు. వానా కాలంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే తీసుకుంటామని ఎఫ్‌సీఐ చెప్పిందని సీఎస్‌ సోమేష్‌ కుమార్ తెలిపారు.