పెద్దపల్లిలో ట్రాక్టర్ నడిపి కరోనా రోగికి అంత్యక్రియలు చేసిన డాక్టర్

  • Published By: madhu ,Published On : July 13, 2020 / 12:47 PM IST
పెద్దపల్లిలో ట్రాక్టర్ నడిపి కరోనా రోగికి అంత్యక్రియలు చేసిన డాక్టర్

కరోనా తెలంగాణను భయపెడుతోంది. ఎంతో మందికి వైరస్ బారిన పడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా..పాజిటివ్ కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే..కరోనా వైరస్ కారణంగా చనిపోయిన వారి పట్ల కనికరం చూపడం లేదు. మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు. డెడ్ బాడీస్ ను తీసుకోకపోవడం, అంత్యక్రియలు కూడా చేయడానికి కుటుంబసభ్యులు ముందుకు రావడం లేదనే ఘటనలు చూశాం.

కొంతమంది ముందుకు వచ్చి..వారికి అంత్యక్రియలు చేస్తున్నారు. తాజాగా ఓ డాక్టర్ చేసిన పనికి అందరూ ప్రశంసిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లిలో ఓ డాక్టర్ చేసిన రిస్క్ కు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనాతో ఓ వ్యక్తి ఆదివారం చనిపోయాడు. కానీ..అంతిమ సంస్కారాలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. డెడ్ బాడీని ఆసుపత్రికి తరలించేందుకు మున్సిపల్ సిబ్బంది భయపడిపోయారు. తాము ఆ పని చేయలేమని చేతులెత్తేశారు.

ఓ ట్రాక్టర్ ను ఆసుపత్రి వద్ద ఉంచి వెళ్లిపోయారు. చివరకు డాక్టర్ శ్రీరామ్ ముందుకొచ్చారు. పరిస్థితి గమనించి మానవత్వంతో స్పందించారు. పీపీఈ కిట్లు ధరించారు. ఇతర సిబ్బందితో కలిసి డెడ్ బాడీస్ ని ట్రాక్టర్ లో ఎక్కించారు. స్వయంగా డాక్టర్ శ్రీరామ్ ట్రాక్టర్ నడిపించి..శ్మశాన వాటికు తీసుకెళ్లారు.

అక్కడ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అతను చేసిన రిస్క్ కు హాట్సాఫ్ చెబుతున్నారు.

Read Here>>కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నా..ముద్రగడ సంచలన నిర్ణయం