Updated On - 7:10 am, Sat, 6 March 21
dog bite injection instead the snake bite : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. పాల్వంచ ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్వాకం బయటపడింది. పాము కాటేసిందని ఆసుపత్రికి వెళ్తే అందుకు తగిన చికిత్స చేయకుండా కుక్క కాటుకు వాడే ఇంజక్షన్‌ను వేసారు. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా నివసించే భరత్ రెడ్డి అనే యువకుడికి ఈ నెల 2వ తేదీన పాము కాటేయడంతో పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లాడు.
డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ ను చూపి చికిత్స చేయవలసిందిగా సిబ్బందిని కోరాడు. అయితే ప్రిస్క్రిప్షన్ ను సరిగా పరశీలించని సిబ్బంది పాము కాటు ఇంజక్షన్‌కు బదులు కుక్క కాటుకు ఇచ్చే ఇంజక్షన్‌ను ఇచ్చి, రెండో డోసుకు 5వ తేదీ రావాలని సదరు యువకుడికి సూచించారు.
సిబ్బంది చెప్పిన మాటలు విన్న యువకుడికి అనుమానం కలిగి పాము కాటుకు ఒక్కసారే ఇంజక్షన్ ఇస్తారు కదా అని నిలదీశాడు. దానికి బదులుగా సిబ్బంది చెప్పిన మాటలు విన్న యువకుడు అవాక్కయ్యాడు. పాము కరిచిందని వస్తే కుక్క కాటుకు ఇచ్చే ఇంజక్షన్ ఇస్తారా అని సిబ్బందిపై మండిపడ్డాడు.
బాధితుడు ఒక్కసారిగా విరుచుకుపడటంతో సిబ్బంది అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. సిబ్బంది నిర్వాకానికి షాక్‌కు గురైన యువకుడు బోరున విలపిస్తూ సమీపంలో ఉన్న ప్రైవేటు వైద్యుడిని ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Karimnagar : ఈ తల్లి పరిస్థితి మరొకరికి రాకూడదు, కరోనా సోకిన సుశీల చనిపోయింది
Maharashtra Factory : వాడి పడేసిన మాస్కులతో పరుపులు..ఫ్యాకర్టీ నిర్వాకం..బట్టబయలు చేసిన పోలీసులు
షాకింగ్ : అత్యాచార నిందితుడి ఫొటో బదులు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫొటో…
Tandoori chicken : తందూరీ చికెన్ తెచ్చిన తంటా..రెస్టారెంట్ సీజ్
తీవ్ర విషాదం.. అంగన్వాడీ కేంద్రంలో పాముకాటుకు చిన్నారి మృతి, అక్కకు తోడుగా వెళ్లి..
పాల్వంచ ప్రభుత్వ బీసీ బాయ్స్ హాస్టల్లో కొట్టుకున్న విద్యార్థులు.. సిగరెట్లు తాగే విషయంలో ఘర్షణ