గ్రేటర్ పేదల కల, డిసెంబర్ నాటికి 74 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు పంపిణీ

  • Published By: madhu ,Published On : August 25, 2020 / 11:49 AM IST
గ్రేటర్ పేదల కల, డిసెంబర్ నాటికి 74 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు పంపిణీ

74 వేల 589 దశల వారీగా ఇండ్లను పంపిణీ చేసేందుకు అధికారులు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారు. డిసెంబర్ నాటికి
గ్రేటర్‌ పరిధిలోని పేదల కోసం లక్ష డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మిస్తున్న విషయం విదితమే.



హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి తదితర జిల్లాల పరిధిలోని 107 ప్రాంతాల్లో వీటిని నిర్మిస్తున్నారు. నాచారం, సనత్‌నగర్‌ ప్రాంతాల్లో సుమారు 500 ఇండ్లను ఇదివరకే లబ్ధి దారులకు పంపిణీ చేశారు. 23,076 ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉండగా, మరో 25,093 ఇండ్ల నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయి.



107 ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఇండ్లలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని 56 చోట్ల భూగర్భ డ్రైనేజీ అందుబాటులో ఉండగా మిగిలిన 51 ప్రాంతాల్లో మురుగునీటి ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లను నిర్మిస్తున్నారు.
ఇండ్ల నిర్మాణం శరవేగంగా కొనసాగుతుంటే, దశలవారీగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ లో వచ్చే దసరా పండుగ నాటికి పూర్తి అయిన ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని అధికారులు భావిస్తున్నారు.



మూడు అంతస్తుల కన్నా ఎక్కువ ఎత్తైన భవనాలకు మెట్లదారితో పాటు లిఫ్టులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ గృహాల్లో ప్రైవేటు గేటెడ్‌ కమ్యూనిటీలకు దీటుగా అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నారు.