Droupadi Murmu Telangana Tour: 29న రాష్ట్రపతి యాదాద్రి సందర్శన .. అదేరోజు సాయంత్రం బొల్లారంలో తేనీటి విందు

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శీతాకాల విడిదికోసం ఈనెల 28న తెలంగాణకు వస్తున్నారు. మూడు రోజులు ఇక్కడే ఉంటారు. ఢిల్లీ నుంచి 28న ఉదయం ప్రత్యేక విమానంలో హకీంపేటలోని విమానాశ్రయానికి చేరుకుంటారు.

Droupadi Murmu Telangana Tour: 29న రాష్ట్రపతి యాదాద్రి సందర్శన .. అదేరోజు సాయంత్రం బొల్లారంలో తేనీటి విందు

droupadi murmui

Droupadi Murmu Telangana Tour:రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శీతాకాల విడిదికోసం ఈనెల 28న తెలంగాణకు వస్తున్నారు. మూడు రోజులు ఇక్కడే ఉంటారు. ఢిల్లీ నుంచి 28న ఉదయం ప్రత్యేక విమానంలో హకీంపేటలోని విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుండి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంకు చేరుకుంటారు. డిసెంబర్ 30న సాయంత్రం రాష్ట్రపతి తిరిగి ఢిల్లీకి వెళ్తారు. తెలంగాణకు రానున్న రాష్ట్రతి దౌపదీ ముర్ము 29న యాదాద్రిలో పర్యటిస్తారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ప్రముఖులు, ఉన్నతాధికారులతో కలిసి తేనీటి విందులో పాల్గొంటారు.

President Draupadi murmu : ద్రౌపది ముర్ముపై ‘రాష్ట్రపత్ని’వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్

రాష్ట్రపతి హైదరాబాద్ రాక సందర్భంగా ప్రభుత్వం ఆమేరకు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రపతి నిలయంలో మరమ్మతు పనులు చేపట్టారు. జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్ బోర్డుల పర్యవేక్షణలో రాజీవ్ రహదారి నుంచి హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వరకు రోడ్డు మరమ్మతు పనులు చేపట్టారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

Draupadi Murmu: ఏపీకి రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఇదిలాఉంటే ఆదివారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఏపీలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను వేదిక పైనుంచి వర్చువల్ గా నిర్వహించారు. విశాఖ నౌకాదళ దినోత్సవంలో పాల్గొన్నారు. కాగా సోమవారం ఉదయం ఆమె తిరుమల వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకుంటారు. ఇందుకోసం ఆదివారం సాయంత్రమే ఆమె తిరుపతి చేరుకున్నారు. స్థానిక శ్రీ పద్మావతి అతిథిగృహం వద్ద రాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి తదితరులు స్వాగతం పలికారు. ఇవాళ ఉదయం 9.30గంటలకు శ్రీవరాహ స్వామివారిని, 9.40గంటలకు శ్రీవారిని దర్శించుకుంటారు. పద్మావతి అతిథి గృహానికి వచ్చి అల్పాహారం స్వీకరించి తిరుపతికి బయలుదేరి వెళ్తారు.