Hyderabad : ఇదేం డ్రైవింగ్‌ సామి.. స్కూటీని ఇలా కూడ నడపొచ్చా?

డ్రంక్ అండ్ డ్రైవ్ ను కట్టడి చేసేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఎక్కడో ఓ చోట మందుబాబులు రోడ్లపైకి వచ్చి ప్రమాదాలకు కారణమవుతూనే ఉన్నారు.

10TV Telugu News

Hyderabad : డ్రంక్ అండ్ డ్రైవ్ ను కట్టడి చేసేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఎక్కడో ఓ చోట మందుబాబులు రోడ్లపైకి వచ్చి ప్రమాదాలకు కారణమవుతూనే ఉన్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుకున్నా.. తీరు మార్చుకోకుండా రోడ్లమీదకు వస్తున్నారు. తాజాగా మద్యం మత్తులో వాహనం నడుపుతున్న ఓ వ్యక్తి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. హైదరాబాద్ పాతబస్తీలో ప్రధాన రహదారిని మద్యం మత్తులో వాహనం నడుపుతూ కనిపించాడు.

చదవండి : Road Accident : పాదచారులను మెరుపువేగంతో ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి

స్కూటీని పాము మెలికలు తిప్పుతూ పక్కనున్న వారిని ఢీకొట్టేంత పనిచేశాడు. తోటి వాహనదారులు ఎంత చెప్పినా వినకుండా.. మద్యం మత్తులో వాహనం నడుపుతూ భయభ్రాంతులకు గురిచేశాడు. ఇందుకు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక అతడి డ్రైవింగ్ చూసిన వాహన ధరలు మెల్లిగా పక్కకు జరిగారు.

చదవండి : Omicron : కొత్త వ్యాక్సిన్ అక్కర్లేదు,బూస్టర్ డోస్ రెడీ..సీరం సీఈవో కీలక వ్యాఖ్యలు

×