Telangana Lockdown: ఆగండ్రా అయ్యా.. అంటే కరోనా కోరి తెచ్చుకుంటున్నారు

కేసులు కేసులకు బీర్లు, చేతిలో సరిపడినన్ని ఫుల్ బాటిళ్లు, పర్సు ఖాళీ అయ్యేంత విస్కీ సీసాలు ఇలా నడిచింది కథ. లాక్ డౌన్ అని ప్రకటించిన క్షణాల్లోనే జరిగింది ఇదంతా. గతేడాది లాక్ డౌన్ కారణంగా కొన్ని నెలల పాటు నాలుకకు ...

Telangana Lockdown: ఆగండ్రా అయ్యా.. అంటే కరోనా కోరి తెచ్చుకుంటున్నారు

Corona Pandemic

Telangana Lockdown: ఏం కొంపలు అంటుకుపోయాయని అంత కంగారు అంటే రేపటి నుంచి మందు దొరకదేమోనని భయం. నాలుక మీద చుక్క పడకపోతే చక్కదనం కరువైపోతుందని ఆందోళన. ఈ ఆత్రంలో కరోనా మహమ్మారి అనే విషయమే మర్చిపోయారు.

ప్రపంచమంతా జాగ్రత్తపడుతున్నా.. దేశమంతా భద్రం బేటా అంటున్నా.. రాష్ట్రం లాక్ డౌన్ ప్రకటించి ఇంట్లోనే ఉండండి ప్రజలారా అని చెప్తున్నా ఒక చెవిన విని మరో చెవితో వదిలేశారు. కొవిడ్ వ్యాక్సిన్ సెంటర్లలో వ్యాక్సిన్ కోసమో, టెస్టింగ్ సెంటర్లో శాంపుల్స్ ఇవ్వడం కోసమే కాదు గంటల తరబడి లైన్లలో నిలబడి మందుబాటిళ్లు అందుకుని విజయోత్సాహంతో వెనుదిరిగారు.

కేసులు కేసులకు బీర్లు, చేతిలో సరిపడినన్ని ఫుల్ బాటిళ్లు, పర్సు ఖాళీ అయ్యేంత విస్కీ సీసాలు ఇలా నడిచింది కథ. లాక్ డౌన్ అని ప్రకటించిన క్షణాల్లోనే జరిగింది ఇదంతా. గతేడాది లాక్ డౌన్ కారణంగా కొన్ని నెలల పాటు నాలుకకు లిక్కర్ రుచి దొరక్క మొహం వాచినట్లు ఎదురుచూసిన క్షణాలు గుర్తు పెట్టుకుని మరీ పోటీపడ్డారు.

ఒకరి మీద ఒకరు పడుతూ.. వైరస్ అనే భయం క్షణం కూడా లేకుండా ఆడాళ్లు సైతం పోటీ పడి మరీ మద్యం కొనుక్కుని వెళ్లారు. అదేంటి ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకూ తెరిచే ఉంటాయి కదా.. అప్పుడు కొనుక్కోవచ్చు కదా అంటే.. ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ ప్రకారం.. ఉదయం 10గంటల లోపు మద్యం షాపులు తీయకూడదట.

ఎక్కడ లేని అలర్ట్‌నెస్ మందు దగ్గరే పుట్టుకొచ్చింది.. అందుకే వీలైనంత మద్యం భుజానేసుకుని పోయారు. కరోనాను మరిచారు.