Drinking water : గ్రేటర్‌ పరిధిలో పలు ప్రాంతాలకు రేపు తాగునీటి సరఫరా బంద్

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాలకు రేపు సాగునీటి సరఫరాను బంద్ చేస్తున్నట్లు జల మండలి ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.గ్రేటర్ వాసులకు మంజీర వాటర్ ను సరఫరా చేసే ...

Drinking water : గ్రేటర్‌ పరిధిలో పలు ప్రాంతాలకు రేపు తాగునీటి సరఫరా బంద్

Drinking Watar

Drinking water : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాలకు రేపు తాగునీటి సరఫరాను బంద్ చేస్తున్నట్లు జల మండలి అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. గ్రేటర్ వాసులకు మంజీర వాటర్ ను సరఫరా చేసే పైప్ లైన్లు మరమ్మతులకు గురికావడంతో సోమవారం ఉదయం 6గంటల నుంచి మంగళవారం ఉదయం 6గంటల వరకు 24 గంటల పాటు వాటర్ బంద్ చేయనున్నట్లు తెలిపారు.

Drinking Water : పరగడుపున నీళ్లు తాగితే బోలెడు ప్రయోజనాలు

తాగునీటి సరఫరా బంద్ కానున్న ప్రాంతాలు… బీరంగూడ, అమీన్పూర్, ఆర్.సి.పురం, దీప్తిశ్రీనగర్, మదీనాగూడ, గంగారం, చందానగర్, మియాపూర్, కేపీహెచ్బీ కాలనీ, కూకట్‌పల్లి, భాగ్యనగర్ కాలనీ, ప్రగతినగర్, నిజాంపేట, బాచుపల్లి, బొల్లారం ఉన్నాయి. అదేవిధంగా లో ప్రెషర్ తో నీటి సరఫరా అయ్యే ప్రాంతాలు ఎర్రగడ్డ, బంజారాహిల్స్ రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి అధికారులు సూచించారు.