Peddler Tony : ముంబై డ్రగ్స్ డాన్ టోనీ ఎవరు ?

సా గడువు ముగిసిన కూడా అక్రమంగా ఇండియాలోనే ఉంటూ డ్రగ్స్ డాన్ గా బిజినెస్ కొనసాగించాడని తెలుస్తోంది. 2013 నుంచి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరిగాడు...

Peddler Tony : ముంబై డ్రగ్స్ డాన్ టోనీ ఎవరు ?

Drugs

Drug Peddler Tony : డ్రగ్స్‌ కేసులో కీలక నిందితుడిగా ఉన్న టోనీని కస్టడీలో భాగంగా రెండో రోజు విచారిస్తున్నారు పోలీసులు. ఇందుకు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. 2022, జనవరి 30వ తేదీ ఆదివారం పంజాగుట్ట పీఎస్ కు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధా కిషన్ రావు, నార్త్ జోన్ ఇన్స్ పెక్టర్ నాగేశ్వరరావు చేరుకున్నారు. అతను నోరు విప్పితే చాలా విషయాలు బయటపడుతాయని భావిస్తున్నారు. ఆధారాలు అతని ముందు ఉంచి.. ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అతను ఎక్కడుండే వాడు ? ఏం చేసేవాడనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read More : Jr NTR-Mahesh Babu : సర్కారు వారి పాట షర్ట్స్.. జూనియర్ ఎన్టీఆర్ జీన్స్..

టోనీ పూర్తి పేరు చుకువు డేవిడ్ అలియాస్ మార్ష టోనీ(37).. తండ్రి పేరు అభియా మార్ష టోనీ.. తల్లి పేరు రోజ్ మేరీ చుకువు. బర్త్ ప్లేస్ నైజీరియాలోని షాగాము విలేజ్. ప్రస్తుతం నైజీరియాలోని ఒక్ పంక్ విలేజ్ టోనీ నివాసం ఉంటున్నట్లు తేలింది. 2013 నుంచి బట్టల వ్యాపారం చేపట్టాడు. కానీ బట్టల వ్యాపారం చేపట్టకుండా దాని ముసుగులో డ్రగ్స్ దందాను తెర లేపాడని సమాచారం. ముంబై నుంచి షిప్స్ ద్వారా డ్రగ్స్ ను ఇండియాకి అక్రమంగా దిగుమతి చేశాడని పోలీసులు భావిస్తున్నారు.

Read More : Minister Harish Rao: జహీరాబాద్ ప్రభుత్వాసుపత్రిలో 500లీ.ల ఆక్సిజన్ ప్లాంట్ ను ప్రారంభించిన మంత్రి హరీష్

వీసా గడువు ముగిసిన కూడా అక్రమంగా ఇండియాలోనే ఉంటూ డ్రగ్స్ డాన్ గా బిజినెస్ కొనసాగించాడని తెలుస్తోంది. 2013 నుంచి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరిగాడు. డ్రగ్స్ కేసులో ఇతని పాత్ర ఉందని తేలడంతో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి.. ముంబైకి వెళ్లి టోనీని పట్టుకున్నారు. ముంబైలోని అందేరి ఈస్ట్ లోని చండివాలి లోక్ మిలన్ కాంప్లెక్స్ ఫ్లాట్ నంబర్ 601లో ఇతడిని అదుపులోకి తీసుకున్నారు.