Drug supplier Mohit : షారూక్‌ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ డ్రగ్స్‌తో పట్టుపడ్డ క్రూజ్‌లో డ్రగ్స్ సప్లయిర్ మోహిత్ ఉన్నట్లుగా గుర్తింపు

షారూక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ డ్రగ్స్‌తో పట్టుపడ్డ క్రూజ్‌లో డ్రగ్స్ సప్లయిర్ మోహిత్ ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. అదే క్రూజ్ లో మోహిత్ డీజే ఏర్పాటు చేసినట్లుగా గుర్తించారు.

Drug supplier Mohit : షారూక్‌ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ డ్రగ్స్‌తో పట్టుపడ్డ క్రూజ్‌లో డ్రగ్స్ సప్లయిర్ మోహిత్ ఉన్నట్లుగా గుర్తింపు

Shocking facts are revealed in the investigation of drug supplier Mohit

Drug supplier Mohit : ముంబై డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ స్టార్‌ షారూక్‌ఖాన్‌ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ అరెస్ట్ అప్పట్లో ఎంత సంచలనం అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ బాద్ షా కుమారుడు డ్రగ్స్ తీసుకున్నాడనే వార్త పెను సంచలనంగా మారింది. ఈకేసులో షారూక్‌ఖాన్‌ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ అరెస్ట్ కేసు విచారణ ఆ తరువాత జరిగిన పరిణామాలు తీవ్ర సంచలనమయ్యాయి. ముంబై డ్రగ్స్‌ కేసులో నిందితుల నుంచి వస్తున్న సమాచారంతో కొత్త కొత్త ఏరియాలు వెలుగులోకి వచ్చాయి. తీగలాగితే డొంక కదిలినట్టు.. బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసుకు హైదరాబాద్‌తో లింక్స్‌ దొరికాయి.

తాజాగా హైదరాబాద్ లో డ్రగ్స్ సప్లయిర్, డీజే ఈవెంట్స్ ఆర్గనైజన్ మైరాన్ మోహిత్ హైదరాబద్ లో డ్రగ్స్ సప్లయ్ చేస్తే అడ్డంగా బుక్ అవ్వటంతో మరోసారి షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఎందుకంటే ముంబై తీరంలోని ఓ క్రూజ్ షిప్ లో ఏర్పాటు చేసిన రేవ్‌ పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించిన ఎన్సీబీ(NCB) అధికారులు రైడ్స్ జరపగా దాంట్లో షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా అధికారులకు పట్టుపడ్డాడు. ఆర్యన్ ఖాన్ పట్టుబడ్డ అదే క్రూజ్ లో హైదరాబాద్ లో డ్రగ్స్ సప్లయ్ చేస్తూ అధికారులకు పట్టుబడ్డ మైరాన్ మోహిత్ కూడా ఉన్నాడని అధికారులు గుర్తించారు. ఆ పార్టీ క్రూజ్ లో మోహిత్ డీజే పార్టీ జరిపినట్లుగా గుర్తించారు.

Drug supplier Mohit : పబ్‌లో వెయిటర్ నుంచి .. డ్రగ్ సప్లయిర్‌గా మారిన హీరోయిన్ భర్త మోహిత్

12 ఏళ్ల క్రితం హైదరాబాద్ నుంచి ముంబైకు వెళ్లిన మోహిత్ ఓ పబ్ లో వెయిటర్ గా పనిచేస్తూ అక్కడికి వచ్చినవారితో పరిచయాలు పెంచుకుని డ్రగ్స్ సప్లయిర్ గా మారాడు. హీరోయిన్ నేహాదేశ్ పాండే ను మోహిత్ వివాహం చేసుకున్నాడు. సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా మోహిత్ కు పరిచయాలున్నాయి. టాలీవుడ్, బాలివుడ్ నటీనటులతో పాటు ప్రముఖ వ్యాపారులతో కూడా సంబంధాలున్నాయి. వారికి డ్రగ్స్ సప్లయి చేసేవాడు. ముంబైలో మకాం వేసిన మోహిత్ 12 ఏళ్లుగా దేశవ్యాప్తంగా డ్రగ్స్ దందా చేస్తున్నాడు. మోహిత్ కు హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారి కృష్ణ కిషోర్ రెడ్డితో కూడా పరిచయాలుండటంతో కిషోర్ రెడ్డి సూపర్ లగ్జరీ బస్సుల్లో పార్సిల్ రూపంలో డ్రగ్స్ ను తెప్పించేవాడు. కేఎంసీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వ్యాపారం చేసే కృష్ణ కిషోర్ రెడ్డి F-హౌస్ కేంద్రంగా డ్రగ్స్ దందా చేసేవాడు.

Drug Supplier Mohit Arrest : డ్రగ్స్ సప్లయర్ మోహిత్ తోపాటు ప్రముఖ వ్యాపారి అరెస్టు

ఈక్రమంలో అధికారులు పక్కా సమాచారంతో హీరోయిన్ భర్త్ మోహిత్ తో పాటు కృష్ణ కిషోర్ రెడ్డిని డ్రగ్స్ సప్లయ్ చేస్తుండగా అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు మోహిత్ ను విచారిస్తున్న క్రమంలో పై విషయాలన్నీ బయటపడ్డాయి. ఇంకా పలువురు వ్యక్తులు మోహిత్ విచారణలో బటయపడతారని సమాచారం. దీంట్లో భాగంగానే F-హౌస్ కు డిసెంబర్ 31న వెళ్లినవారి డేటాను అధికారులు సేకరిస్తున్నారు. F-హౌస్ కేసు నమోదు చేయనున్నారు.