హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం, యెమెన్ దేశస్తులతో సహా నలుగురు అరెస్టు

  • Published By: madhu ,Published On : November 22, 2020 / 10:30 PM IST
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం, యెమెన్ దేశస్తులతో సహా నలుగురు అరెస్టు

Drugs in Hyderabad : హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. న్యూ ఇయర్ సందర్భంగా డ్రగ్స్ సరఫరా చేయాలని పలువురు ప్లాన్స్ చేస్తున్నారు. హైదరాబాద్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు అందించిన కీలక సమాచారం ఆధారంగా..డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు చేశారు. ముగ్గురు యెమెన్ దేశస్తులతో సహా.. నలుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 30 గ్రాముల MDMA, కేజీ గంజాయి స్వాధీనం చేసుకున్నారు.



న్యూ ఇయర్ వేడుకల కోసం డ్రగ్స్ సరఫరా అవుతుందనే పక్కా సమాచారంతో దాడి చేశారు. గోవా కేంద్రంగా డ్రగ్స్ దందా జరుగుతున్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి యెమెన్‌లో మాత్రమే పెరిగే గాంజా లాంటి ఖాట్ ఆకులను స్వాధీనం చేసుకున్నారు.



2020 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా డ్రగ్స్ అమ్మినా..తీసుకున్నా 10 సంవత్సరాల జైలు తప్పదని రాచకొండ కమిషనర్ మహేశ్ భగత్ ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నగరంలో డ్రగ్స్‌ మాఫియా పంట పండిస్తాయి. యువతే టార్గెట్ గా డ్రగ్స్ మాఫియా పక్కా ప్రణాళికలు రచిస్తుంటాయి. సాధారణ రోజులు కంటే న్యూ ఇయర్ లో మరింతగా డ్రగ్స్ మాఫియా కన్ను విస్తరిస్తుంది.



న్యూ ఇయర్ వచ్చిదంటే చాలు సాధారణ సయమంలో అమ్మే రేట్ల కంటే పదిరెట్లు పెంచేస్తారు. గ్రాము కొకైన్ రూ. వెయ్యి ఉంటే న్యూ ఇయర్ కు రూ.10 పెంచేస్తారు. న్యూఇయర్ సందర్భంగా డ్రగ్స్ మాఫియాపై పోలీసులు మరింత నిఘా పెట్టారు. అయితే..పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా డ్రగ్స్ దందాను మాత్రం పూర్తిగా అరికట్టలేకపోతున్నారు. హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా గుట్టుగా సాగిపోతోంది. పోలీసుల కళ్లు గప్పి మాదకద్రవ్యాలను నగరంలోకి తరలిస్తున్నారు.