Hyderabad Drugs Mafia : హైదరాబాద్‌కు మత్తు టెన్షన్.. న్యూ ఇయర్ టార్గెట్‌గా రెచ్చిపోతున్న డ్రగ్స్ ముఠాలు

డ్రగ్స్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. న్యూయర్ ను టార్గెట్ చేశాయి. ఉత్సాహంగా సాగే సెలబ్రేషన్స్ లో మరింత జోష్ నింపేలా వేడుకల్లో డ్రగ్స్ తో మత్తు ఎక్కించేందుకు ఇప్పటి నుంచే ప్లాన్స్ చేస్తున్నారు కేటుగాళ్లు.

Hyderabad Drugs Mafia : హైదరాబాద్‌కు మత్తు టెన్షన్.. న్యూ ఇయర్ టార్గెట్‌గా రెచ్చిపోతున్న డ్రగ్స్ ముఠాలు

Hyderabad Drugs Mafia : డ్రగ్స్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. న్యూయర్ ను టార్గెట్ చేశాయి. ఉత్సాహంగా సాగే సెలబ్రేషన్స్ లో మరింత జోష్ నింపేలా వేడుకల్లో డ్రగ్స్ తో మత్తు ఎక్కించేందుకు ఇప్పటి నుంచే ప్లాన్స్ చేస్తున్నారు కేటుగాళ్లు. నిన్నమొన్నటి వరకు విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ హైదరాబాద్ కు తెప్పించిన ముఠాలు ఇప్పుడు రూట్ మార్చి హైదరాబాద్ నుంచే విదేశాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాయి.

డ్రగ్స్ ను తరలిస్తున్న ముఠాలను రోజుకో చోట అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. ఎంత కట్టడి చేస్తున్నా డ్రగ్స్ ముఠాలు మరింత రెచ్చిపోతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే కోట్లాది రూపాయల డ్రగ్స్ ను సీజ్ చేశారంటే.. డ్రగ్స్ ముఠాలు ఎంత బరి తెగిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని పోలీసులు ఎంత ప్రయత్నిస్తున్నా డ్రగ్స్ దందా చాపకింద నీరులా కొనసాగుతూనే ఉంది.

Also Read..Hyderabad Drugs Mafia : హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టివేత.. విలువ రూ.10కోట్లు

తాజాగా డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు సైబరాబాద్ పోలీసులు. హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకల కోసం ఇప్పటినుంచే డ్రగ్స్ విక్రయిస్తున్న డ్రగ్స్ పెడ్లర్ రాజేష్ నాయక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ విక్రయిస్తుండగా మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి 48గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. నైజీరియాకు చెందిన ప్రధాన డ్రగ్ పెడ్లర్ పరారీలో ఉన్నాడు. ఒక్క గ్రాము డ్రగ్ ని రూ.7వేలకు విక్రయిస్తున్నాడు రాజేష్ నాయక్.

గత వారంలోనూ హైదరాబాద్ లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు మల్కాజ్ గిరి ఎస్వోటీ పోలీసులు. వారి వద్ద నుంచి రూ.10కోట్ల విలువైన 8 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. కొత్త సంవత్సరం రాబోతున్న వేళ న్యూఇయర్ సెలెబ్రేషన్స్ కోసం పెద్ద ఎత్తున ఇతర దేశాలకు డ్రగ్స్ రవాణకు ప్లాన్ చేస్తోంది డ్రగ్స్ ముఠా.

Also Read..Huge Sex Racket Gang Arrest : భారీ సెక్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టు.. జాబ్స్, లగ్జరీ లైఫ్ పేరుతో వ్యభిచారం

హైదరాబాద్ నుంచి కొరియర్ ద్వారా విదేశాలకు డ్రగ్స్ ని సరఫరా చేస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ వయా పుణె నుంచి సముద్ర మార్గం ద్వారా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కు డ్రగ్స్ తరలిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. లుంగీ ప్యాకింగ్స్ లో డ్రగ్స్ ను ఉంచి కొరియర్ ద్వారా తరలిస్తున్నట్లు గుర్తించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

నిందితుల నుంచి 8 కిలోల మెపిడ్రిన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మార్కెట్ లో ఒక్కో కిలో(మెపిడ్రిన్) రూ.5కోట్లు విలువ చేస్తుందని తెలిపారు. ఈ ముఠా ఇప్పటివరకు 8సార్లు డ్రగ్స్ ని విదేశాలకు సప్లయ్ చేసినట్లుగా గుర్తించారు. మొత్తంగా 75 కిలోల డ్రగ్స్ ని ఈ ముఠా హైదరాబాద్ నుంచి తరలించారు. న్యూఇయర్ వేడుకలే టార్గెట్ గా ఈ ముఠాలు డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.