దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధం

  • Published By: sreehari ,Published On : November 3, 2020 / 06:54 AM IST
దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధం

Dubbaka bye elections : దుబ్బాక ఉప ఎన్నికకు సమయం ఆసన్నమైంది. కాసేపట్లోనే పోలింగ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. లక్షా 98 వేల మందికి పైగా ఓటర్లు.. తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మరో 20 మంది అభ్యర్థుల భవితవ్యం కొద్ది గంటల్లోనే తేలబోతోంది.



దుబ్బాక బైపోల్ పోలింగ్‌కు సర్వం సిద్ధం చేశారు అధికారులు. నియోజక వర్గంలోని 315 పోలింగ్ బూత్‌ల్లో.. 5 వేల మంది సిబ్బంది పనిచేయనున్నారు. మొత్తం లక్షా 98 వేల 756 మంది ఓటర్లు.. మరోసారి తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో.. పోలింగ్ మొత్తం పూర్తిగా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ జరపనున్నారు ఎన్నికల అధికారులు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో.. దుబ్బాకలో ఉపఎన్నిక జరుగుతోంది. ఈ బైపోల్ బరిలో.. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మరో 20 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
https://10tv.in/dubbaka-bye-elections-tension-in-siddipet/
పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లు.. తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు. పోలింగ్ సరళిని పర్యవేక్షించేందుకు.. ఒక్కో మండలానికి ఏసీబీ స్థాయి అధికారిని నియమించారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని ప్రకటించనున్నారు.



ఇప్పటికే.. పోలింగ్ శాతం పెరిగేలా.. ఓటర్లకు అవగాహన కల్పించారు ఎన్నికల అధికారులు. ఇప్పటికే దుబ్బాకలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొడనంతో.. 11 వందల మంది పోలీసులు బైండోవర్ చేశారు. ఇప్పటివరకు 58 లక్షల నగదును సీజ్ చేశారు.



కలెక్టర్ భారతి, సీపీ జోయల్ డేవిస్.. మొత్తం పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. 315 పోలింగ్ కేంద్రాల్లో.. 89 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. వాటి దగ్గర.. కేంద్ర బలగాలను మోహరించారు. ప్రతి పోలింగ్ బూత్ దగ్గర వెబ్ కాస్టింగ్ సదుపాయాన్ని కల్పించారు.



ఉపఎన్నిక బరిలో 23 మంది నిలవడంతో.. రెండు ఈవీఎంలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో పోలింగ్ బూత్‌లో.. ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్‌తో పాటు మరో ముగ్గురు విధులు నిర్వహించనున్నారు.

పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు సోషల్ డిస్టెన్సింగ్ పాటించేలా మార్కింగ్ చేశారు. ఒకవేళ ఓటర్లు మాస్కులు మర్చిపోయి వస్తే.. అక్కడికక్కడే మాస్కులు ఇచ్చేలా ఏర్పాటు చేశారు.