దుబ్బాకను గెలిచిన బీజేపీ: Round 2 Round update

  • Published By: vamsi ,Published On : November 10, 2020 / 07:22 AM IST
దుబ్బాకను గెలిచిన బీజేపీ: Round 2 Round update

[svt-event title=బీజేపీదే గెలుపు date=”10/11/2020,3:49PM” class=”svt-cd-green” ] 22రౌండ్లు వరకూ హోరాహోరీగా సాగిన ఉపఎన్నిక ఫలితాల్లో 23వ రౌండ్ లో 412 ఓట్లు ఆధిక్యం దక్కించుకున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు గెలుపు ఖాయం అయింది. మొత్తంగా బీజేపీకి 1470ఓట్ల మెజారిటీ దక్కింది. గేమ్ ఛేంజర్‌గా మారిన చేగుంట తర్వాత.. నార్సింగ్ విజేతను నిర్ణయించింది. కాగా, సూరంపల్లి, పోతిరెడ్డి పేట, ఏటిగడ్డ కిష్టాపూర్‌లో ఈవీఎంలు మొరాయించాయి. వాటి కౌంటింగ్ ఫలితాలు లెక్కించకుండా వదిలేశారు. [/svt-event]

[svt-event title=”22వ రౌండ్లో బీజేపీ” date=”10/11/2020,3:35PM” class=”svt-cd-green” ] 22వ రౌండ్లో బీజేపీ 438ఓట్ల ఆధిక్యం మొత్తంగా 1058ఓట్ల ఆధిక్యం దక్కించుకుంది బీజేపీ. [/svt-event]

[svt-event title=”21వ రౌండ్ మళ్లీ బీజేపీ” date=”10/11/2020,3:23PM” class=”svt-cd-green” ] బీజేపీ 620ఓట్ల ఆధిక్యంలోకి వచ్చింది. 21వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ 58వేల 161 ఓట్లు రాగా, టీఆర్ఎస్ 57వేల 541 ఓట్లు, కాంగ్రెస్ 20వేల 268ఓట్లు వచ్చాయి. పోలైన్ ఓట్లు లక్షా 64వేల 192 ఉండగా ఇప్పటివరకూ లక్షా 51వేల 528ఓట్లు లెక్కించారు. [/svt-event]

[svt-event title=”19వ రౌండ్ ముగిసేసరికి” date=”10/11/2020,3:31PM” class=”svt-cd-green” ] 19వ రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ 251ఓట్ల ఆధిక్యంలోకి చేరింది. వరుసగా ఏడు రౌండ్లలో మెజారిటీ దక్కించుకుంది. [/svt-event]

[svt-event title=”18వ రౌండ్‌లోనూ టీఆర్ఎస్సే” date=”10/11/2020,2:37PM” class=”svt-cd-green” ] టీఆర్ఎస్ అనుకూల ఓట్ల ఊపందుకున్నాయి. 18వ రౌండ్ ముగిసేసరికి 688ఓట్ల ఆధిక్యత సాధించాయి. బీజేపీ ఆధిక్యం కోల్పోయి 174మెజారిటీలో మాత్రమే ఉంది. చేగుంట మండలం కీలకంగా మారింది. [/svt-event]

[svt-event title=”17వ రౌండ్ లోనూ కార్..” date=”10/11/2020,2:35PM” class=”svt-cd-green” ] ఉత్కంఠభరితంగా సాగుతున్న దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఆధిక్యాన్ని కోల్పోతుంది. 3వేలకు పైగా ఉన్న మెజారిటీని క్రమంగా కోల్పోయి 17వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ 862 లీడింగ్‌లో మాత్రమే ఉంది. [/svt-event]

[svt-event title=”16వ రౌండ్‌లో టీఆర్ఎస్ లీడింగ్” date=”10/11/2020,2:15PM” class=”svt-cd-green” ] 16వ రౌండ్ కౌంటింగ్‌లో టీఆర్ఎస్ 749ఓట్ల ఆధిక్యం సాధించింది. బీజేపీ ఆధిక్యం తగ్గి 1734కి పడిపోయింది. టీఆర్ఎస్ 2వేల 483 ఓట్లు దక్కించుకుంది. [/svt-event]

[svt-event title=”15వ రౌండ్ కౌంటింగ్‌లో టీఆర్ఎస్” date=”10/11/2020,2:18PM” class=”svt-cd-green” ] పుంజుకుంటున్న టీఆర్ఎస్ 15వ రౌండ్ లోనూ ఆధిక్యం సాధించింది. బీజేపీపై 955 ఓట్ల ఆధిక్యం సాధించిన టీఆర్ఎస్ 3వేల 27ఓట్లు దక్కించుకోగా బీజేపీ 2వేల 72ఓట్లు మాత్రమే దక్కించుకుంది. [/svt-event]

[svt-event title=”ముగిసిన 14వ రౌండ్ కౌంటింగ్ ” date=”10/11/2020,2:08PM” class=”svt-cd-green” ] 14వ రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ 288 ఓట్ల ఆధిక్యం ఉంది. బీజేపీ 3,438 ఓట్ల ఆధిక్యంలో ఉంది. బీజేపీ 41,514, టీఆర్ఎస్ 38,076, కాంగ్రెస్ 12,658 ఓట్లు వచ్చాయి. [/svt-event]

[svt-event title=”13వ రౌండ్‌లో టీఆర్ఎస్ ” date=”10/11/2020,2:27PM” class=”svt-cd-green” ] 13వ రౌండ్‌లో టీఆర్ఎస్ ఆధిక్యంలో టీఆర్ఎస్ – 304 టీఆర్ఎస్ – 2,824 బీజేపీ – 2,524 మొత్తంగా బీజేపీ ఆధిక్యం 3,236 [/svt-event]

[svt-event title=”12వ రౌండ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం” date=”10/11/2020,1:33PM” class=”svt-cd-green” ] పన్నెండో రౌండ్‌లో అనూహ్యంగా కాంగ్రెస్ 83ఓట్ల మెజారిటీలోకి వచ్చింది. టీఆర్ఎస్, బీజేపీల మధ్య జరుగుతున్న హోరాహోరీ పోరులో కాంగ్రెస్‌కు 2వేల 80ఓట్లు, బీజేపీకి 1997 ఓట్లు, టీఆర్ఎస్‌కు 1900ఓట్లు వచ్చాయి. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో టీఆర్ఎస్ వెనుకబడింది. [/svt-event]

[svt-event title=”11వ రౌండ్‌లో బీజేపీ హవా ” date=”10/11/2020,1:17PM” class=”svt-cd-green” ] మరోసారి ముందుకొచ్చింది బీజేపీ. 9వ రౌండ్ ఆధిక్యాన్ని కొనసాగిస్తూ.. 199 ఓట్ల ఆధిక్యంతో నిలిచింది. మొత్తంగా 3వేల 933ఓట్ల ఆధిక్యంలో బీజేపీ కొనసాగుతోంది. టీఆర్ఎస్‌కు 2వేల 766ఓట్లు రాగా, బీజేపీకి 2వేల 965వచ్చాయి.

[/svt-event][svt-event title=”10వ రౌండ్‌లో టీఆర్ఎస్” date=”10/11/2020,1:02PM” class=”svt-cd-green” ] పదో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ మళ్లీ పుంజుకుంది. 456 ఓట్ల ఆధిక్యం సంపాదించింది. ఓవరాల్‌గా పది రౌండ్లు పూర్తయ్యేసరికి 3వేల 734మెజారిటీలో బీజేపీ ఉంది. టీఆర్ఎస్ 2వేల 948 ఓట్లు రాగా, బీజేపీ 2492తో కొనసాగుతోంది. [/svt-event]

[svt-event title=”9వ రౌండ్ ముగిసే సరికి..” date=”10/11/2020,12:52PM” class=”svt-cd-green” ] టీఆర్ఎస్ 2వేల 329 ఓట్లతో ఉండగా బీజేపీ వెయ్యి 84ఓట్ల ఆధిక్యంతో 3వేల 413ఓట్లు దక్కించుకుంది. ఓవరాల్‌గా బీజేపీకి 4వేల 190 ఓట్ల మెజార్టిలో దూసుకెళ్తోంది. [/svt-event]

[svt-event title=”8వ రౌండ్‌లో ఆధిక్యంలో బీజేపీ!” date=”10/11/2020,12:42PM” class=”svt-cd-green” ] దుబ్బాక కౌంటింగ్‌ 8 రౌండ్లు పూర్తికాగా.. 6 రౌండ్లలో బీజేపీ, రెండు రౌండ్లలో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం సాధించాయి. ఓవరాల్‌గా బీజేపీ 25,878.. టీఆర్‌ఎస్‌ 22,722.. కాంగ్రెస్‌ 5,125 ఓట్లు సాధించాయి. 8వ రౌండ్‌లో బీజేపీ 621 ఓట్ల ఆధిక్యాన్ని సాధించగా.. ఎనిమిది రౌండ్లు పూర్తయ్యేసరికి బీజేపీ 3,106 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ రౌండ్‌లో బీజేపీకి 3,116ఓట్లు టీఆర్‌ఎస్‌‌కు 2,495ఓట్లు.. కాంగ్రెస్‌‌కు 1,122 ఓట్లు వచ్చాయి. [/svt-event]

[svt-event title=”ఏడవ రౌండ్‌లో ఆధిక్యంలో టీఆర్ఎస్” date=”10/11/2020,12:10PM” class=”svt-cd-green” ] మొదటి నుంచి ఐదు రౌండ్ల రిజల్ట్‌లో బీజేపీ ఆధిక్యం సాధించగా.. ఆరు, ఏడు రౌండ్‌లలో మాత్రం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వరుసగా 353, 182ఓట్ల​ ఆధిక్యం సాధించారు. రామలింగారెడ్డి స్వగ్రామం చిట్టాపూర్‌లో టీఆర్‌ఎస్‌కు 846 ఓట్ల ఆధిక్యం లభించింది. దుబ్బాక ఉపఎన్నికలో మొత్తం 1,64,192 ఓట్లు పోలవ్వగా.. ఇప్పటిదాకా 45,175 ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. [/svt-event]

[svt-event title=”సీన్ రివర్స్: ఆరో రౌండ్‌లో ఆధిక్యంలో టీఆర్ఎస్‌” date=”10/11/2020,11:40AM” class=”svt-cd-green” ] దుబ్బాక ఎన్నికల్లో ఐదు రౌండ్లలో ఆధిక్యం ప్రదర్శించిన బీజేపీపై ఆరో రౌండ్‌లోమాత్రం టీఆర్‌ఎస్ అభ్యర్థి పైచేయి సాధించారు. ఈ రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి 4,062 ఓట్లు సాధించగా, భాజపా అభ్యర్థికి 3,709 ఓట్లు వచ్చాయి. ఇంకా 17రౌండ్‌లు మిగిలి ఉన్నాయి. అయితే ఆరో రౌండ్‌లో టీఆర్ఎస్ గెలుపొందినా… మొత్తంగా బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థిపై బీజేపీ 2,667 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఆరో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ 353 ఓట్ల​ ఆధిక్యం సాధించింది. ఇప్పటివరకు బీజేపీ 20,226.. టీఆర్‌ఎస్‌ 17,559.. కాంగ్రెస్‌ 3,254 ఓట్లు సాధించాయి.[/svt-event]

[svt-event title=”ఐదవ రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యం” date=”10/11/2020,11:16AM” class=”svt-cd-green” ] దుబ్బాకలో ఐదో రౌండ్ పూర్తి బీజేపీకి 3020ఓట్ల ఆధిక్యం లిభించింది. బీజేపీకి ఇప్పటివరకు 16,517ఓట్లు, టీఆర్ఎస్‌కు 13,497ఓట్లు, కాంగ్రెస్‌కు 2,724ఓట్లు లభించాయి. [/svt-event]

[svt-event title=”నాలుగో రౌండ్ పూర్తి.. ముందంజలో బీజేపీ” date=”10/11/2020,10:43AM” class=”svt-cd-green” ] దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య పోరు నడుస్తుండగా.. నాలుగో రౌండ్‌లో కూడా టీఆర్ఎస్‌పై బీజేపీ ముందంజలో సాగుతుంది. దుబ్బాక ఉపఎన్నికలో మూడు రౌండ్‌లలో ముందంజలో నిలిచిన బీజేపీ, నాలుగో రౌండ్‌లో కూడా ముందంజలో సాగుతుంది. దుబ్బాక మండల కౌంటింగ్‌ పూర్తవగా.. నాలుగు రౌండ్‌లు పూర్తయ్యేసరికి బీజేపీకి 13055ఓట్లు, టీఆర్ఎస్‌కు 10371ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 2,158ఓట్లు లభించాయి. మొత్తంగా చూసుకుంటే నాలుగో రౌండ్ ముగిసేసరికి బీజేపీకి 2684ఓట్ల ఆధిక్యం లభించింది. ఈ రౌండ్‌లో బీజేపీకి 3,832 ఓట్లు, టీఆర్ఎస్‌ పార్టీకి 2,407 ఓట్లు లభించాయి. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి స్వగ్రామంలో బీజేపీ 110 ఓట్ల ఆధిక్యం సాధించింది. [/svt-event]

[svt-event title=”మూడో రౌండ్‌లోనూ ముందంజలో బీజేపీ” date=”10/11/2020,10:17AM” class=”svt-cd-green” ] దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య ఆసక్తికర పోరు నడిచినట్లుగా ఫలితాలను చూస్తే అర్థం అవుతుంది. బీజేపీ బలంగా టీఆర్ఎస్‌పై ముందంజలో సాగుతుంది. దుబ్బాక ఉపఎన్నికలో రెండు రౌండ్‌లలో ముందంజలో నిలిచిన బీజేపీ, మూడో రౌండ్‌లో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. మూడో రౌండ్‌లో బీజేపీకి 9223ఓట్లు, టీఆర్ఎస్‌కు 7,964ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 1,931ఓట్లు లభించాయి. మొత్తంగా చూసుకుంటే మూడో రౌండ్ ముగిసేసరికి బీజేపీకి 1259ఓట్లు లభించాయి. [/svt-event]

[svt-event title=”రెండవ రౌండ్ ముగిసేసరికి బీజేపీకి 1,135ఓట్ల ఆధిక్యం” date=”10/11/2020,9:54AM” class=”svt-cd-green” ] రెండవ రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీకి 1135ఓట్ల ఆధిక్యం లభించగా.. బీజేపీకి మొత్తం 6492ఓట్లు, టీఆర్ఎస్‌కు 5357ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 1315ఓట్లు లభించాయి. [/svt-event]

[svt-event title=”రెండో రౌండ్‌లో కూడా బీజేపీ ముందంజ!” date=”10/11/2020,9:46AM” class=”svt-cd-green” ] దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ సిద్దిపేటలోని ఇందూరు ఇంజినీరింగ్‌ కళాశాలలో కొనసాగుతోంది. తొలుత పోస్టల్‌ ఓట్ల లెక్కింపు పూర్తి చేశారు. తొలి రౌండ్‌లో భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు 341 ఓట్ల ఆధిక్యంలో ముందంజలో ఉండగా.. రెండవ రౌండ్‌లో కూడా బీజేపీనే ముందంజలో నిలిచింది. రెండవ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 1282ఓట్లు లభించగా.. బీజేపీకి 1,561ఓట్లు లభించాయి. దీంతో బీజేపీకి రెండు రౌండ్లలో కలిపి 620ఓట్ల ఆధిక్యం లభించింది. రెండు రౌండ్లలో కలిపి టీఆర్ఎస్‌కు 4149ఓట్లు రాగా.. 4769ఓట్లు లభించాయి. కాంగ్రెస్ 922ఓట్లతో మూడవ స్థానంలో ఉంది. [/svt-event]

[svt-event title=”తొలి రౌండ్‌లో బీజేపీ ముందంజ” date=”10/11/2020,9:22AM” class=”svt-cd-green” ] దుబ్బాక ఉపఎన్నికల కౌంటింగ్ సాగుతుండగా తొలి రౌండ్‌లో బీజేపీ ముందంజలో నిలిచింది. ఫస్ట్ రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందనరావు టీఆర్ఎస్ అభ్యర్ధి సుజాత కంటే 341ఓట్ల ముందంజలో ఉన్నారు. బీజేపీకి తొలి రౌండ్‌లో 3,208 ఓట్లు రాగా.. టీఆర్ఎస్‌కు 2,867ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు కేవలం 648ఓట్లు మాత్రమే లభించాయి. [/svt-event]

[svt-event title=”పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్ ఆధిక్యం” date=”10/11/2020,8:54AM” class=”svt-cd-green” ] దుబ్బాక ఉప ఎన్నికలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం సాధించింది. మొత్తం 1453 పోస్టల్‌ బ్యాలెట్స్‌, 51 సర్వీస్‌ ఓట్లు ఉన్నాయి. [/svt-event]

[svt-event title=”అభ్యర్థుల్లో టెన్షన్.. 8గంటల నుంచి కౌంటింగ్!” date=”10/11/2020,7:24AM” class=”svt-cd-green” ] Dubbaka Bypoll Result Live Updates: తెలంగాణ రాష్ట్రంలో రసవత్తరంగా సాగిన దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్‌ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఫలితం కోసం అన్ని పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా.. అభ్యర్థుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. [/svt-event]