సాగర్ ఉపఎన్నికలో దుబ్బాక ఫలితం పునరావృతం, 2023లో మాదే అధికారం

సాగర్ ఉపఎన్నికలో దుబ్బాక ఫలితం పునరావృతం, 2023లో మాదే అధికారం

dubbaka result repeat in sagar bypoll: నాగార్జున సాగర్ ఉపఎన్నికలోనూ దుబ్బాక ఫలితం రిపీట్ అవుతుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ జోస్యం చెప్పారు. బలహీన వర్గాల ప్రజలందరూ బీజేపీకి అనుకూలంగా ఉన్నారని ఆయన చెప్పారు. 2023లో తెలంగాణలో అధికారమే ధ్యేయంగా పార్టీ ముందుకు సాగుతోందని చెప్పారు.

బీజేపీ నాయకులే లక్ష్యంగా ప్రభుత్వం దాడులు చేస్తోంది, ప్రభుత్వ దాడులకు భయపడేదే లేదని సంజయ్ అన్నారు. ప్రజలను పీడించుకుతింటున్న కేసీఆర్ కు భయం పుట్టిస్తానని చెప్పారు. గుర్రంపాడులో గిరిజనులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింసిస్తున్నారని..ఇందుకేనా తెలంగాణ సాధించింది అని గిరిజనులు బాధపడుతున్నారని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ మోర్చా పథాధికారుల సమావేశం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

రాచరిక పాలనతో ప్రజలను పీడించుకుతింటున్నారని ఆరోపించారు. నిన్న గిరిజనులు, పేదలపై ఇష్టారీతిన దాడులు చేశారని, సహించలేక తెలంగాణ లోని పేదలంతా బీజేపీవైపు చూస్తున్నారని, వారికి న్యాయం చేయాలనేది బీజేపీ తపన అని అన్నారు. పాలకులకు కనువిప్పు కలగాలంటే దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలను వచ్చే ఎన్నికల్లో పునరావృతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. హైకోర్టు తీర్పును అమలు చేయలేని స్థితిలో అధికారులున్నారని, పదవీ విరమణ పొందిన వారికి కీలక బాధ్యతలు అప్పగిస్తూ పనిచేస్తున్న ఐపీఎస్ లను అవమానిస్తున్నారని బండి సంజయ్ అన్నారు. కోట్లు ఖర్చు చేసినా నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో గిరిజనులు టీఆర్ఎస్ కు ఓటు వేయరని బండి అన్నారు.