Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వేధింపులపై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశాను: యువతి

ఎమ్మెల్యే చిన్నయ్య లైంగిక వేధింపులకు గురిచేశారని ఆరోపిస్తూ ఆమె ఇటీవల ఢిల్లీలోని తెలంగాణ భవన్ పార్కింగ్ ఏరియాలో విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం విదితమే.

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వేధింపులపై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశాను: యువతి

MLA Durgam Chinnaiah

Durgam Chinnaiah – BRS: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధించారంటూ కొన్ని వారాలుగా ఆరోపిస్తోన్న ఓ యువతి తాజాగా మరో సెల్ఫీ వీడియో విడుదల చేశారు. మంచిర్యాల జిల్లా (Mancherial) పర్యటనకు వస్తున్న సీఎం కేసీఆర్ (KCR) దుర్గం చిన్నయ్య వ్యవహారంపై స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు.

ఆయనపై పూర్తి స్థాయి విచారణ జరిపించి, బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని అన్నారు. తాను దుర్గం చిన్నయ్య గురించి చెప్పడానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ అపాయింట్మెంట్ కోరానని, ఎన్నిసార్లు అడిగినా ఎలాంటి సమాధానం ఇప్పటి వరకు రాలేదని చెప్పారు. ఇప్పటికైనా తనకు న్యాయం చేస్తారని భావిస్తున్నానని అన్నారు.

ఇవాళ జాతీయ మహిళా కమిషన్‌ను కలిసి దుర్గం చిన్నయ్య గురించి వివరించి చెప్పానని తెలిపారు. వెంటనే స్పందించిన మహిళా కమిషన్ తెలంగాణ పోలీసులకు నోటీసులు పంపించిందని వివరించారు. దుర్గం చిన్నయ్యపై 15 రోజుల్లోగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అందజేయాలని ఆదేశించిందని తెలిపారు.

తనకు అండగా నిలిచిన తెలంగాణ బీజేపీ మహిళా మోర్చా నేతలకు కృతజ్ఞతలు చెబుతున్నానని పేర్కొన్నారు. కాగా, ఎమ్మెల్యే చిన్నయ్య లైంగిక వేధింపులకు గురిచేశారని ఆరోపిస్తూ ఆమె ఇటీవల ఢిల్లీలోని తెలంగాణ భవన్ పార్కింగ్ ఏరియాలో విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం విదితమే. దుర్గం చిన్నయ్య బెల్లంపల్లిలో ఒకసారి దాడికి పాల్పడ్డారని, తమ కుటుంబ సభ్యులను కూడా బెదిరిస్తున్నారని అన్నారు.

Hyderabad : డబ్బు అడిగిన యువతికి కోరిక తీర్చాలని వేధింపులు, ఆ తర్వాత వీడియోలు చూపి.. హైదరాబాద్‌లో దారుణం