TSRTC: ప్రారంభమైన ఎలక్ట్రిక్ గరుడ బస్సులు.. మొదట తిరిగేది ఈ రూట్లోనే

ప్రైవేట్ ర‌వాణా సేవ‌ల‌కు ధీటుగా టి.ఎస్‌.ఆర్టీసీ మెరుగైన స‌దుపాయాలు క‌ల్పిస్తుండ‌టంతో ప్ర‌జ‌లు ఆద‌రిస్తున్నార‌ని, ప్ర‌తి ఏటా ప్ర‌భుత్వం రూ.1500 కోట్లు టి.ఎస్‌.ఆర్టీసీకి కేటాయిస్తూ ఆదుకుంటోంద‌న్నారు. గ‌త సంవ‌త్స‌రన్న‌ర కాలంగా సంస్థ‌లో ఎన్నో మంచి మార్పులు తీసుకురావ‌డం జ‌రిగింద‌ని, భ‌విష్య‌త్తులో 2 వేల బ‌స్సులు రాబోతున్నాయ‌ని వెల్ల‌డించారు

TSRTC: ప్రారంభమైన ఎలక్ట్రిక్ గరుడ బస్సులు.. మొదట తిరిగేది ఈ రూట్లోనే

E-Garuda: తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ ప్ర‌యాణీకుల సౌక‌ర్యార్థం ప‌ర్యావ‌ర‌ణ‌ హిత‌మైన ఏసీ బ‌స్సుల‌ను అందుబాటులోకి తీసుకొస్తోందని, ఈ-బస్సులను ప్రవేశపెట్టడంలో టి.ఎస్‌.ఆర్టీసీ దేశంలోనే అగ్రగామి నిలిచిందని ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ అన్నారు. కొత్త‌గా అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ-గ‌రుడ బ‌స్సుల‌ను మంగ‌ళ‌వారం సాయంత్రం హెద‌రాబాద్‌లోని మియాపూర్‌లో సంస్థ ఛైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ తో పాటు ఎం.డి స‌జ్జ‌న‌ర్ తో క‌లిసి ఆయ‌న లాంఛ‌నంగా జెండా ఊపి ప్రారంభించారు. అనంత‌రం ఈ కొత్త బ‌స్సులో కొద్ది దూరం ప్ర‌యాణించి అందులోని స‌దుపాయాల‌ను ప‌రిశీలించారు.

Vijayawada: రేపు మహా పూర్ణాహుతి.. సీఎం జగన్, స్వామీజీలు వస్తారు: మంత్రి కొట్టు సత్యనారాయణ

అంత‌కుమందు ఆయ‌న మాట్లాడుతూ, జన సాంద్రత కలిగిన నగరాల్లో శిలాజ ఇంధనాన్ని ఉపయోగించడం వల్ల ప‌ర్యావ‌ర‌ణ కాలుష్యాన్ని త‌గ్గించ‌డం జ‌రుగుతోందని, పర్యావరణ అనుకూల ప్రజా రవాణాను అందించడం కోసం తెలంగాణ రాష్ట్ర ఎల‌క్ట్రిక్ వెహికిల్ విధానానికి అనుగుణంగా టి.ఎస్‌.ఆర్టీసీ ఈ-గ‌రుడ బ‌స్సుల‌ను స‌మ‌కూర్చుకోవ‌డం అభినంద‌నీయ‌మ‌ని కొనియాడారు. ఇటీవ‌ల కాలంలో టి.ఎస్‌.ఆర్టీసీ కొత్త‌గా సూప‌ర్ ల‌గ్జ‌రీ, ఏసీ స్లీప‌ర్ మొత్తం 760 బ‌స్సుల‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేస్తూ కొత్త బ‌స్సుల రాక‌తో మ‌ళ్లీ 10 వేల బ‌స్సుల‌కు చేరువ అవుతుండటం శుభ‌ప‌రిణామ‌న్నారు.

Akhilesh Yadav: ప్రాంతీయ పార్టీలనే హీరోగా చూడాలి.. 2024లపై కాంగ్రెస్ పార్టీకి అఖిలేష్ వినూత్న ప్రతిపాదన

ఎల‌క్ట్రిక్ బ‌స్సులకు ప్ర‌యాణీకుల నుంచి మంచి ఆద‌ర‌ణ‌ ల‌భిస్తోంద‌ని, ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేర‌వ‌య్యే విధంగా మ‌రింత మెరుగైన ర‌వాణా సేవ‌లు అందించేందుకు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతోంద‌ని తెలిపారు. సంస్థ ఛైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ మాట్లాడుతూ హైద‌రాబాద్ న‌గ‌రం నుంచి ప్ర‌తి రోజు 50 వేల మంది విజ‌య‌వాడ‌, రాజ‌మండ్రికి ప్ర‌యాణీస్తున్నార‌ని పేర్కొంటూ ఈ – గ‌రుడ బ‌స్సుల‌ను విజ‌య‌వాడ‌కు న‌డుపుతున్న‌ట్లు చెప్పారు.

Karnataka CM: కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరో తెలిపోయింది.. ఇంతకీ కాంగ్రెస్ ఎవరిని నిర్ణయించిందో తెలుసా?

ప్రైవేట్ ర‌వాణా సేవ‌ల‌కు ధీటుగా టి.ఎస్‌.ఆర్టీసీ మెరుగైన స‌దుపాయాలు క‌ల్పిస్తుండ‌టంతో ప్ర‌జ‌లు ఆద‌రిస్తున్నార‌ని, ప్ర‌తి ఏటా ప్ర‌భుత్వం రూ.1500 కోట్లు టి.ఎస్‌.ఆర్టీసీకి కేటాయిస్తూ ఆదుకుంటోంద‌న్నారు. గ‌త సంవ‌త్స‌రన్న‌ర కాలంగా సంస్థ‌లో ఎన్నో మంచి మార్పులు తీసుకురావ‌డం జ‌రిగింద‌ని, భ‌విష్య‌త్తులో 2 వేల బ‌స్సులు రాబోతున్నాయ‌ని వెల్ల‌డించారు. ఆధునిక హంగుల‌తో రూపుదిద్దుకున్న ఈ – గ‌రుడ బ‌స్సుల‌ను కూడా ప్ర‌యాణీకులు ఆద‌రించ‌నున్నార‌ని తాను ఆశిస్తున్న‌ట్లు చెప్పారు.