Eamcet : విద్యార్థులకు గుడ్ న్యూస్, ఎంసెట్ దరఖాస్తు గడువు మరోసారి పెంపు

తెలంగాణ ఎంసెట్ 2021 ద‌ర‌ఖాస్తు గ‌డువును మ‌రోసారి పొడిగించారు. ఎలాంటి అప‌రాధ రుసుం లేకుండా ఈ నెల 24వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చని

Eamcet : విద్యార్థులకు గుడ్ న్యూస్, ఎంసెట్ దరఖాస్తు గడువు మరోసారి పెంపు

Eamcet

Eamcet : తెలంగాణ ఎంసెట్ 2021 ద‌ర‌ఖాస్తు గ‌డువును మ‌రోసారి పొడిగించారు. ఎలాంటి అప‌రాధ రుసుం లేకుండా ఈ నెల 24వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చని ఎంసెట్ క‌న్వీన‌ర్ గోవర్థన్ వెల్ల‌డించారు. విద్యార్థుల విజ్ఞ‌ప్తి మేర‌కు ద‌ర‌ఖాస్తు గ‌డువును పొడిగించినట్లు ఆయన తెలిపారు. కాగా తెలంగాణ ఎంసెట్ పరీక్షను ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో జేఎన్‌టీయూ నిర్వహిస్తోంది. వాస్తవానికి ఈ పరీక్ష దరఖాస్తు గడువు మే 18న ముగియాల్సి ఉండగా.. ఇప్పటికీ నాలుగుసార్లు పొడిగించగా.. మరలా.. జూన్ 24 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఎంసెట్ పరీక్షలు జూలై 5 నుంచి 9 వరకు కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) మోడ్‌ ఆధారంగా జరుగుతాయి. పరీక్షలు మొత్తం 9 సెషన్లలో నిర్వహించనున్నట్లు ఇదివరకే అధికారులు వెల్లడించారు. అగ్రికల్చర్‌ వారికి 3, ఇంజినీరింగ్‌ వారికి 5 సెషన్లు, మరో సెషన్‌ను అవసరాన్ని బట్టి నిర్వహించనున్నట్లు జేఎన్‌టీయూ వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ.. మరలా తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇప్పటివరకు ఇంజనీరింగ్ కోసం 2 లక్షల 25 వేల 125 మంది, అగ్రికల్చర్ బీఎస్సీ కోసం 75 వేల 519 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ గడువు పొడిగింపు వల్ల వివిధ కారణాలతో దరఖాస్తు చేసుకోలేకపోయిన వారు కూడా దరఖాస్తు చేసుకనే అవకాశం కలిగింది.