Telangana EAMCET : తెలంగాణలో నేటి నుంచి ఎంసెట్ ఎగ్జామ్..నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

తెలంగాణలో నేటి నుంచి ఎంసెట్ ఎగ్జామ్ ప్రారంభం కానుంది. పరీక్ష సమయానికి రెండు గంటల ముందు నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. నిమిషం ఆలస్యం అయినా సెంటర్ లోకి ప్రవేశం ఉండదు.

10TV Telugu News

Telangana EAMCET : తెలంగాణలో నేటి నుంచి ఎంసెట్ ఎగ్జామ్ ప్రారంభం కానుంది. పరీక్ష సమయానికి రెండు గంటల ముందు నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. నిమిషం ఆలస్యం అయినా సెంటర్ లోకి ప్రవేశం ఉండదు. ఇవాళ, రేపు, ఎల్లుండి ఇంజినీరింగ్, 9, 10 తేదీల్లో అగ్రికల్చర్ పరీక్షలను నిర్వహిస్తారు.

తెలంగాణలో 82, ఏపీలో 23 సెంటర్లను ఏర్పాటు చేశారు. పరీక్ష సమయంలో విద్యార్థులకు కరోనా నిబంధనలు తప్పనిసరి చేశారు. విద్యార్థులు మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లను వెంట తెచ్చుకోవాలని సూచించారు. సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా ఆరోగ్య వివరాలను వెల్లడించాలన్నారు.

ఎంసెట్ కు ఇసారి 2లక్షల 51 వేల 6 వందల 6 మంది దరఖాస్తు చేశారు. విద్యార్థుల సౌలభ్యం కోసం తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. విద్యార్థులు ఎంచుకున్న ఆప్షన్ కు అనుగుణంగా ప్రశ్నాపత్రాలను అందించనున్నారు. విద్యార్థులకు పరీక్ష కేంద్రాల రూట్ మ్యాప్ ను హాల్ టిక్కెట్ పై ముద్రించారు.

మరోవైపు గతేడాది వరకు ఇంటర్ మార్కులకు ఎంసెట్ 25 శాతం వెయిటేజ్ ఉండేది. అయితే ఈసారి వెయిటేజ్ ను ప్రభుత్వం రద్దు చేసింది. కరోనా కారణంగా సెకండ్ ఇయర్ లో సిలబస్ ను 70 శాతానికి కుదించారు. అందుకనుగుణంగానే ఎంసెంట్ లోనూ సిలబస్ తగ్గించి ఆ ప్రకారమే ప్రశ్నలు ఇస్తున్నామని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు. మొదటి సంవత్సరానికి సంబంధించి 100 శాతం, రెండో ఏడాదికి 70 శాతం సిలబస్ కుదిస్తున్నారు.

10TV Telugu News