Eatala Rajender : టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి : ఈటల

టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని..ఆ పార్టీ నేతలు చట్టాన్ని తమ చుట్టంలాగా వాడుకుంటున్నారని ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు సంధించారు.

Eatala Rajender : టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి : ఈటల

Etala Rajender

Eatala Rajender once again criticized the TRS : టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చాక ఈటల రాజేందర్ ఏమాత్రం తగ్గట్లేదు. ప్రతీసారి గులాబీ నేతలమీద విరుచుకుపడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో మరోసారి ఈటల తీవ్ర విమర్శలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని..ఆ పార్టీ నేతలు చట్టాన్ని తమ చుట్టంలాగా వాడుకుంటున్నారని విమర్శలు సంధించారు. అటువంటి నీచ సంస్కృతి టీఆర్ఎస్ నేతలకే ఉందని..పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటినుంచి తనపై మాటలతో దాడులు చేస్తున్నారని..అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

మీ చిల్లర దాడులకు భయపడే వ్యక్తి కాదని అన్నారు. తెలంగాణ ప్రజలు ఆత్మగౌవరం కలిగినవారనీ..వారి ఆత్మగౌరవాన్ని వారు ఎప్పుడు పోగొట్టుకోరని..మీలా దిగజారుడు రాజకీయాలు తెలంగాణ ప్రజలకు తెలిదన్నారు. సహజ న్యాయసూత్రాలను పాటించే పార్టీ బీజేపీ ఒక్కటేనని..టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా పార్టీని వీడినప్పటినుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ అగ్రనేతలు సైతం విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈటల విమర్శలకు ప్రతివిమర్శలు చేస్తూ కౌంటరిస్తున్నారు. ఇలా ఈటల-టీఆర్ఎస్ నేతల మధ్య కౌంటర్ ఎన్ కౌంటర్ లు కొనసాగుతున్నాయి.

ముఖ్యంగా హుజూరాబాద్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార పార్టీ నేతలు తమ స్ట్రాటజీని మార్చుతున్నారు. ఈటల రాజేందర్ పై వేటు వేసిన తర్వాత ఆపార్టీకి చెందిన జిల్లా నేతలను ఆయన్ను కట్టడి చేసేందుకు రంగంలోకి దింపారు. ఇందులో భాగంగానే కరీంనగర్ ఉమ్మడి జిల్లా మంత్రులు అయిన గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ తోపాటు ఎమ్మెల్యే బాల్క సుమన్ మాత్రమే ఈటలపై నేరుగా విమర్శలు చేస్తున్నారు. ఆయన చేస్తున్న విమర్శలకు ప్రతి విమర్శలు చేయడంతో పాటు పార్టీని నియోజకవర్గంలో చక్కబెడుతున్నారు.

అయితే ఈటల రాజేందర్ రేపటి నుండి నియోజకవర్గంలో పాదయాత్ర చేయనుండడంతో పాటు బీజేపీ రాష్ట్ర నేతలు మొత్తం హుజూరాబాద్ పై దృష్టి సారించారు. ఈటలను గెలిపించుకునేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే జాతీయ స్థాయి నేతలను కూడా హుజూరాబాద్‌కు రప్పించేందుకు ప్రణాళికలు రూపోందించారు. ఇలా హుజూరాబాద్ ఉప ఎన్నిక బీజేపీ, టీఆర్ఎస్ మధ్య కాకరేపుతోంది.