ED And IT Raids : మైనింగ్ అక్రమాలపై ఈడీ, ఐటీ దూకుడు.. కరీంనగర్, హైదరాబాద్ లో కొనసాగుతున్న సోదాలు

మైనింగ్ అక్రమాలపై ఈడీ, ఐటీ దూకుడు పెంచింది. మైనింగ్ అక్రమాలపై ఈడీ, ఐటీ జాయింట్ ఆపరేషన్ చేస్తున్నాయి. కరీంనగర్, హైదరాబాద్ లో భారీగా ఈడీ, ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. రెండు చోట్ల 30 ప్రాంతాల్లో ఐటీ, ఈడి సోదాలు కొనసాగుతున్నాయి. కరీంనగర్ గ్రానైట్ అక్రమాలపై గతంలో సీబీఐ కేసు నమోదు అయింది.

ED And IT Raids : మైనింగ్ అక్రమాలపై ఈడీ, ఐటీ దూకుడు పెంచింది. మైనింగ్ అక్రమాలపై ఈడీ, ఐటీ జాయింట్ ఆపరేషన్ చేస్తున్నాయి. కరీంనగర్, హైదరాబాద్ లో భారీగా ఈడీ, ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. రెండు చోట్ల 30 ప్రాంతాల్లో ఐటీ, ఈడి సోదాలు కొనసాగుతున్నాయి. కరీంనగర్ గ్రానైట్ అక్రమాలపై గతంలో సీబీఐ కేసు నమోదు అయింది. సీబీఐతో పాటు ఈడీలో గ్రానైట్ అక్రమాలపై కేసు నమోదు అయింది. రెండు చోట్ల అరవింగ్ గ్రానైట్ యజమాని అరవింద్ వ్యాసి ఇంట్లో సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ లోని  సోమాజిగూడ, హైదర్ గూడ జనప్రియలో ఈడీ, ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. సోమాజీగూడ గ్రానైట్ వ్యాపారి శ్రీధర్ నివాసంలో సోదాలు జరుపుతున్నారు.

గ్రానైట్ క్వారీ నిర్వహకులు ఫేమా నిబంధనలు ఉల్లంఘించారని అని ఫిర్యాదు చేశారు. గతంలో 8 ఏజెన్సీలకు ఈడీ నోటీసులు ఇచ్చింది. తక్కువ పరిమాణం చూపి ఎక్కువ ఎగుమతి, విదేశాలకు ఎగుమతులపై ఈడీ, ఐటీ ఆరా తీస్తోంది. ఆదాయ పన్ను చెల్లింపుల విషయంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. గతంలో స్వేతా ఏజన్సీ, ఏఎస్ యూవై షిప్పింగ్, జెఎం బాక్సీ, మైథిలీ ఆధిత్యట్రాన్స్పోర్ట్, అరవింద్ గ్రానైట్స్, షాండియా ఏజన్సీస్, పిఎస్ ఆర్ ఏజన్సీస్, కెవిఏ ఎనర్జీ, శ్రీవెంకటేశ్వర గ్రానేట్స్ కంపెనీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. మైనింగ్ శాఖ నుండి అనుమతులు పొందినా పరిధికి మించి తవ్వకాలు జరిపారని ఆరోపణలు ఉన్నాయి.

Rajasthan: అక్రమ మైనింగ్‌ను అడ్డుకున్న కానిస్టేబుల్‌పై ఇసుక మాఫియా దాడి

ఫెమా నిభందనలు ఉల్లంగించి మనీలాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. విదేశాలకు గ్రానైట్ ఎగుమతులపై ఈడీ ఆరా తీస్తోంది. ఆదాయపన్ను ఎగవేతలపై ఐటీ శాఖ సోదాలు చేస్తోంది. కరీంనగర్ లో అరవింద గ్రానైట్స్ యజమాని జగన్నాథ వ్యాస్ ఇంటిపై ఈడీ దాడులు చేసింది. కరీంనగర్ శాస్త్రి రోడ్ లోని పాగన్ వాలియ గ్రనేట్ వ్యాపారి ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి.
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో దాదాపు 350కిపైగా గ్రానైట్‌ సంస్థలు ఉన్నాయి. వీటిల్లో అత్యధికం రాజకీయ నేతలవే ఉన్నాయి. వారిలో ఒకరు మంత్రి గంగుల కమలాకర్‌. ఆయన ఆధ్వర్యంలోనూ కొన్ని గ్రానైట్‌ సంస్థలు ఉన్నాయి. 2012లో జరిగిన స్కామ్‌పై సీబీఐ గతంలో నోటీస్ ఇచ్చింది.

బీజేపీ నేతల ఫిర్యాదుతో సీబీఐ రంగంలోకి దిగింది. 2011-2013 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కరీంనగర్‌ నుంచి కాకినాడ పోర్టు, కృష్ణపట్నం పోర్టుల నుంచి వేల కోట్లలో గ్రానైట్‌ ఎగుమతలు జరిగాయి. దొంగ లెక్కలతో సరుకు ఎగుమతి చేసి షిప్పింగ్‌ ఏజెన్సీలు వందల కోట్ల మోసానికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలోనే ఈ రెండు పోర్టుల నుంచి లక్షల టన్నుల గ్రానైట్‌ రాయి విదేశాలకు ఎగుమతైంది. అక్రమాలను అప్పట్లోనే గుర్తించిన విజిలెన్స్‌ అధికారులు భారీ జరిమానా విధించారు.

Chandrababu : చిత్తూరు జిల్లాలో అక్రమ మైనింగ్… సీఎస్‌కు చంద్రబాబు లేఖ

ప్రభుత్వానికి దాదాపు 750 కోట్లు చెల్లించాలని ఆనాటి ఉత్తర్వుల్లో ఉంది. ఆ నాటి కేసుకు సంబంధించి బీజేపీ నేతలు గత ఏడాది నవంబర్‌లో CBIకి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో చాలా సంస్థలు ఉన్నా.. మంత్రి గంగుల కమలాకర్‌ లక్ష్యంగానే చర్యలు ఉంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ సీబీఐ నుంచి వచ్చిన ఆదేశాలతో విశాఖపట్నంలోని CBI ఏసీబీ విభాగం గతంలో మైనింగ్‌ కంపెనీలు.. షిప్పింగ్‌ ఏజెన్సీలకు నోటీసులు ఇచ్చాయి. ఎంత సరుకు పోర్టుల నుంచి ఎగుమతి చేశారు? పర్మిట్లు ఉన్నాయా? అపరాధ రుసుం ఎందుకు చెల్లించలేదు? వంటి ప్రశ్నలు ఆ నోటీసులో ఉన్నాయని తెలుస్తోంది.

అంతర్జాతీయ స్థాయిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గ్రానైట్ వ్యాపారానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా జిల్లా నుంచి వెళ్లిన పెద్ద బండరాళ్లను కాకినాడ, కృష్ణపట్నం, చెన్నై, విశాఖపట్నం పోర్టుల నుంచి వివిధ దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ సమయంలో పలు సంస్థలు తరలించిన రాయి పరిమాణాన్ని తక్కువ కొలతలు తీసి అక్రమాలకు పాల్పడ్డారని అప్పట్లో ఫిర్యాదుల్ని అందాయి.
2013లో విజిలెన్స్ అధికారులు చేసిన తనిఖీల్లో డొల్లతనం బయటపడిందని ఆయా గ్రానైట్ సంస్థలకు రూ.124.94కోట్ల ఫెనాల్టీ విధించారు. దీనికి ఐదింతలుగా రూ.749 కోట్లు చెల్లించాలని ఆదేశింంచారు. దీనిపై అప్పట్లో కొందరు గ్రానైట్ సంస్థలు కోర్టుకు వెళ్లి కొంత ఫైన్ చెల్లించారు. మిగతా వాళ్ళు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారు.

Mining Scam : మైనింగ్ స్కామ్… బీహార్, జార్ఖండ్ లలో ఈడీ సోదాలు

దీంతో అప్పట్లో బండి సంజయ్, స్థానిక న్యాయవాది బీజేపీ నేత మహేందర్ రెడ్డి కూడా ఈడీకి ఫిర్యాదు చేశారు.  కాలయాపన చేస్తూ ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్నారని వినతి పత్రం అందించారు. దీనిపై గతంలో ఒకింత కదలిక కనిపించినా.. తరువాత దర్యాప్తు ముందుకు సాగలేదు. తాజాగా హైదరాబాద్ కు చెందిన శేఖర్రావు ఫిర్యాదుతో మరోసారి ఈ సోదాలు చేస్తున్నట్లు సమాచారం. కరీంనగర్ లో ప్రస్తుతం కమాన్ దగ్గర ఉన్న అరవింద్ వ్యాస్, మంకమ్మ తోటలోని శ్వేతా గ్రానైట్స్, కరీంనగర్ శాస్త్రి రోడ్డులోని గ్రైనైట్ వ్యాపారి పాగన్ వాలియా ఇంట్లోనూ సోదాలు జరుగుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు