ED Summons-MP Nama : ఎంపీ నామాకు ఈడీ సమన్లు.. 25న విచారణకు హాజరుకావాలి..

టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 25న విచారణకు హాజరుకావాల్సిందిగా నామాకు నోటీసులు పంపింది. బ్యాంకు రుణాలను అక్రమంగా మళ్లించారనే కేసులో నామాకు ఈడీ సమన్లు పంపింది.

ED Summons-MP Nama : ఎంపీ నామాకు ఈడీ సమన్లు.. 25న విచారణకు హాజరుకావాలి..

Ed Issues Summons To Mp Nama Nageswara Rao (1)

ED Summons-MP Nama : టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 25న విచారణకు హాజరుకావాల్సిందిగా నామాకు నోటీసులు పంపింది. బ్యాంకు రుణాలను అక్రమంగా మళ్లించారనే కేసులో నామాకు ఈడీ సమన్లు పంపింది. మదుకాన్ కేసులో నిందితులందరికి సమన్లు జారీచేసింది. ఇప్పటికే ఖమ్మం, హైదరాబాద్‌ సహా మొత్తం 6 చోట్ల సోదాలు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మధుకాన్ డైరెక్టర్ల ఇళ్లల్లో కూడా సోదాలు జరిపిన సంగతి తెలిసిందే.

మదుకాన్ గ్రూప్ డైరెక్టర్ల ఇళ్లల్లో ఇటీవలే రెండు రోజుల పాటు సోదాలు జరిగాయి. ఈడీ సోదాల్లో భారీగా దస్త్రాలు, లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకుంది. అలాగే అకౌంట్లు, హార్డ్ డిస్కులను ఈడీ బృందాలు విశ్లేషిస్తున్నాయి. బ్యాంకు రుణాలను మళ్లించిన కేసులో నామా నాగేశ్వరరావుకు సమన్లు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. మధుకాన్ కేసులో ఉన్న నిందితులందరికీ ఈడీ సమన్లు జారీ చేసింది.

మూడు రోజుల క్రితమే నామా నివాసాలు, ఆఫీస్, మధుకాన్ కాంపెనీ, డైరెక్టర్ల ఇళ్లల్లో 20 గంటల పాటు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కంప్యూటర్లు, బ్యాంక్ లావాదేవీలు, కీలక డాక్యమెంట్లకు సంబంధించి కీలక ఆధారాలను ఈడీ సేకరించింది. నగదు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే ప్రాజెక్టుకు సంబంధించి పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. సోదాలు అనంతరం విచారణకు ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలని ఈడీ నోటీసులో పేర్కొంది.