ED notices to TRS MLA Rohit Reddy : బెంగళూరు డ్రగ్స్ కేసులో.. TRS ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు

తాండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. బెంగళూరు డ్రగ్స్ కేసులో విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు. డిసెంబర్ 19న విచారణకు రావాలని నోటీసుల్లో ఈడీ పేర్కొంది.

ED notices to TRS MLA Rohit Reddy :  బెంగళూరు డ్రగ్స్ కేసులో.. TRS ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు

ED notices to TRS MLA Rohit Reddy

ED notices to TRS MLA Rohit Reddy : తాండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. బెంగళూరు డ్రగ్స్ కేసులో విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు. డిసెంబర్ 19న విచారణకు రావాలని నోటీసుల్లో ఈడీ పేర్కొంది. కాగా రోహిత్ రెడ్డి అనగానే మొయినాబాద్ ఫామ్ హౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం గుర్తుకొస్తుంది. ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటనలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయటం ఆ తరువాత ఆకేసు పలు మలుపులు తిరగటం నిందితులను అరెస్ట్ చేయటం వంటి కీలక పరిణామాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేయటం ఆసక్తికరంగా మారింది. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లోనే ఈ ఎమ్మెల్యే ప్రలోభాల కేసు పెను సంచలనం సృష్టించింది.ఈక్రమంలో రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేయటం హాట్ టాపిక్ గా మారింది. అలాగే రోహిత్ రెడ్డితో పాటు ఇంకా పలువురికి ఈడీ నోటీసులు జారీ చేయనున్నట్లుగా సమాచారం. వీరిలో సినిరంగానికి..ఇటు రాజకీయ రంగానికి చెందిన వ్యక్తులకు కూడా త్వరలోనే ఈడీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

కాగా..2021లో బెంగళూరులో పోలీసులు సినీ ప్రముఖులకు నైజీరియాకు చెందిన ఓ వ్యక్తి డ్రగ్స్ సపఫరా చేయటానికి రాగా వారిలో ఇద్దరిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని వద్దనుంచి రాబట్టిన సమాచారంతో టీఆర్ఎస్ కు చెందిన నేతలు కూడా ఉన్నట్లుగా తేలింది. అలాగే తెలంగాణకు చెందిన పలువురు వ్యాపారులు..టీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారని నైజీరియా నుంచి డ్రగ్స్ తెచ్చిన వ్యక్తులు ఇచ్చిన సమాచారంలో ఉంది.దీంతో సినీ రంగానికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు విచారించారు. ఇదే డ్రగ్స్ కేసులో తెలంగాణకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా గతంలో ప్రచారం జరిగింది. ఈక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయటం హాట్ టాపిక్ గా మారింది.

కాగా ఇక్కడో విషయం గమనించాలి. బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తోందని ప్రభుత్వం ఆరోపిస్తున్న క్రమంలో ఈ బెంగళూరు డ్రగ్స్ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేయటం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా రోహిత్ రెడ్డి ఫామ్ హౌసులో ఎమ్మెల్యేల కొనుగులో వ్యవహారం బయటకు రావటం ఆయనే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయటం ఇది బీజేపీ కుట్ర అని ఆరోపిస్తుండటం..ఇటువంటి పలు కీలక పరిణామాల మధ్య రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు రావటం గమనించాల్సిన విషయం..పైగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడుతూ ఘాటు విమర్శలు చేసే తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ గతంలో మాట్లాడుతూ..బెంగళూరు డ్రగ్స్ కేసును రీ ఓపెన్ చేయిస్తానని వ్యాఖ్యానించారు. ఈక్రమంలో రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేయటం గమనించాల్సిన విషయం.