Hyderabad: హైదరాబాద్‌లో ఈడీ దాడుల కలకలం.. ప్రముఖ ఫార్మా కంపెనీలో కొనసాగుతున్న సోదాలు
రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు మైన్స్, ఆటో మొబైల్స్, పలు ఫార్మా కంపెనీలతో పాటు వివిధ గ్రూప్ ఆఫ్ కంపెనీలను ఫినిక్స్ ఏర్పాటు చేసింది. ముఖ్యంగా నిర్మాణ రంగంలో హైదరాబాద్‌లో భారీ ఎత్తున ప్రాజెక్టులను ఫినిక్స్ గ్రూప్ నిర్మిస్తుంది.

ED Rides
Hyderabad: హైదరాబాద్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) శనివారం సోదాలు చేపట్టింది. ఉదయం 6 గంటలకు ఏకకాలంలో పలు ప్రాంతాల్లో ఈ సోదారులు ప్రారంభమయ్యాయి. ఫినిక్స్ కంపెనీ (Phoenix Company) కి చెందిన కార్యాలయాలు, ఫినిక్స్ చైర్మన్ చుక్కపల్లి సురేష్ (Phoenix Chairman Chukkapalli Suresh), ఎండీ అవినాష్ (MD Avinash) నివాసాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. జూబ్లిహిల్స్‌లోని రోడ్ నెం. 45లోని ఫినిక్స్ ప్రధాన కార్యాలయంలోనూ ఈడీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. గతంలో ఇదే కార్యాలయంలో ఐటీ సోదాలు నిర్వహించింది. ఫినిక్స్ కంపెనీ రియల్ ఎస్టేట్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుంది.
AP CID Searches : ఏపీ మాజీ మంత్రి నారాయణ కుమార్తె నివాసంలో ఏపీ సీఐడీ సోదాలు
రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు మైన్స్, ఆటో మొబైల్స్, పలు ఫార్మా కంపెనీలతో పాటు వివిధ గ్రూప్ ఆఫ్ కంపెనీలను ఫినిక్స్ ఏర్పాటు చేసింది. ముఖ్యంగా నిర్మాణ రంగంలో హైదరాబాద్‌లో భారీ ఎత్తున ప్రాజెక్టులను ఫినిక్స్ గ్రూప్ నిర్మిస్తుంది. గతేడాది ఆగస్టు 23న ఆదాయ పన్ను శాఖ పన్ను ఎగవేశారనే ఆరోపణలతో ఫినిక్స్ కంపెనీపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఐటీ ఇచ్చిన సమాచారం మేరకు ఈడీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
ఫినిక్స్ టెక్‌జోన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కూడా ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. ఫినిక్స్ టెక్‌జోన్ డైరెక్టర్ పాటిబండ గోపికృష్ణ నివాసం జూబ్లీహిల్స్ రోడ్డు నెం. 48లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గోపీకృష్ణ మొత్తం 19 కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్నారు. ఫినిక్స్ ఇన్ఫో సిటీ, ఫినిక్స్ వెంచర్స్, ఫినిక్స్ స్పెసెస్, హైదరాబాద్ ఇన్‌ఫ్రా సిటీ, ఫినిక్స్ అర్బన్ డెవలపర్స్, ఫినిక్స్ టెక్ స్పేస్, ఫినిక్స్ మల్టీఫ్లెక్స్, ఫినిక్స్ ఇన్ఫో స్పేస్, ఫినిక్స్ టెక్‌జోన్, ఫినిక్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లతో పాటు మరికొన్ని కంపెనీలకు డైరెక్టర్ గా ఉన్నాడు. ఇవికాక మరో 15 కంపెనీలకు అసోసియేట్ గా గోపీకృష్ణ ఉన్నారు.