ED Raids-MP Nama : నామా ఇంట్లో భారీగా నగదు.. నోట్లు లెక్కపెట్టే మిషన్‌తో ఈడీ అధికారులు లోపలికి…!

టీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు నివాసంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టేట్ (ఈడీ) సోదాలు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. హైదారాబాద్‌లోని నివాసంతో పాటుగా ఆయన కార్యాలయాల్లోనూ ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి.

ED Raids-MP Nama : నామా ఇంట్లో భారీగా నగదు.. నోట్లు లెక్కపెట్టే మిషన్‌తో ఈడీ అధికారులు లోపలికి…!

Ed Raids To Be Continued On Mp Nama Nageswara Rao Home And Companies

ED Raids Continued on MP Nama Nageswara Rao Home : టీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు నివాసంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టేట్ (ఈడీ) సోదాలు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. హైదారాబాద్‌లోని నివాసంతో పాటుగా ఆయన కార్యాలయాల్లోనూ ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్ నామా నాగేశ్వరరావు సమక్షంలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. దాదాపు 13 గంటలుగా ఈడీ సోదాలు చేస్తోంది.

ఖమ్మం, హైదరాబాద్‌తో పాటూ ఆరు చోట్ల ఏక కాలంలో ఈడీ సోదాలు చేస్తోంది. మధుకాన్ కంపెనీ‌లో పలు రాంచీ ప్రాజెక్టు సంబంధించిన డాక్యుమెంట్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. కొద్దిసేపటి క్రితమే డబ్బులు లెక్కపెట్టే మిషన్‌ను ఈడీ అధికారులు లోపలికి తీసుకెళ్లినట్టు సమాచారం. నామ నివాసంలో పెద్ద ఎత్తున నగదు గుర్తించినట్టు విశ్వసనీయ సమాచారం..శుక్రవారం రాత్రి వరకు ఈడీ అధికారుల సోదాలు కొనసాగే అవకాశం ఉంది.

గతంలో బ్యాంకుల్లో రుణాలు తీసుకొని తిరిగి చెల్లించకుండా విదేశాలకు అక్రమంగా నిధులు మళ్లించారంటూ నామాపై ఈడీ మని ల్యాండరింగ్ యాక్ట్ కేసు నమోదు చేసింది. మధుకాన్ సంస్థ పేరుతో బ్యాంకుల్లో నామా రుణాలు పొందారు. దాదాపుగా రూ 1,064 కోట్ల వరకు రుణాలు పొందారు. ఆ మొత్తాన్ని అక్రమంగా మళ్లించినట్లుగా ఈడీ అభియోగం మోపింది. సీబీఐ ఛార్జ్ షీటు ఆధారంగా ఈడీ విచారణ మొదలుపెట్టింది.

తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు నామా సంస్థలపైన ఈడీ సోదాలు చేయడం రాజకీయంగానూ హాట్ టాపిక్‌గా మారింది. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన ఈడీ అధికారులు అటు నివాసాల్లోనూ..ఇటు కార్యాలయాల్లో ఏక కాలంలో సోదాలు కొనసాగిస్తున్నారు. ఖమ్మం నుంచి గెలిచిన నామా ప్రస్తుతం లోక్ సభలో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సోదాల గురించి ఈడీ వివరాలు వెల్లడించాల్సి ఉంది.