Nizam Mukarram Jha : నేడు టర్కీ నుంచి హైదరాబాద్ కు 8వ నిజాం నవాబ్ ముకర్రం జా భౌతికకాయం.. రేపు మక్కా మసీదులో అంత్యక్రియలు

అనారోగ్యంతో టర్కీలో మృతి చెందిన ఎనిమిదో నిజాం ముకర్రం జా (89) భౌతికకాయాన్ని నేడు హైదరాబాద్ కు తీసుకరానున్నారు. నిజాం ముకర్రం పార్థీవ దేహాన్ని టర్కీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన కుటుంబ సభ్యులు తీసుకరానున్నారు. ఇవాళ సాయంత్ర 5 గంటలకు టర్కీ నుంచి చార్టెడ్ ఫ్లైట్ లో ముకర్రం జా భౌతికకాయాన్ని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు తరలిస్తారు.

Nizam Mukarram Jha : నేడు టర్కీ నుంచి హైదరాబాద్ కు 8వ నిజాం నవాబ్ ముకర్రం జా భౌతికకాయం.. రేపు మక్కా మసీదులో అంత్యక్రియలు

Nizam Mukarram Jha (1)

Nizam Mukarram Jha : హైదరాబాద్ ఎనిమిదో నిజాం నవాబ్ మీర్ బర్కత్ అలీ ఖాన్ వాలాషన్ ముకర్రం జా బహదూర్ మృతి చెందిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో టర్కీలో మృతి చెందిన ఎనిమిదో నిజాం ముకర్రం జా (89) భౌతికకాయాన్ని నేడు హైదరాబాద్ కు తీసుకరానున్నారు. నిజాం ముకర్రం పార్థీవ దేహాన్ని టర్కీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన కుటుంబ సభ్యులు తీసుకరానున్నారు. ఇవాళ సాయంత్ర 5 గంటలకు టర్కీ నుంచి చార్టెడ్ ఫ్లైట్ లో ముకర్రం జా భౌతికకాయాన్ని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు తరలిస్తారు. అక్కడి నుంచి ఆయన పార్థీవ దేహాన్ని చౌమహల్లా ప్యాలెస్ కు తీసుకురానున్నారు.

రాత్రి 7.45 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య కుటుంబ సభ్యులు, నిజాం కుటుంబానికి చెందిన వ్యక్తులు, నిజాం ట్రస్టులు ట్రస్టీలకు నివాళులర్పించేందుకు అనుమతిస్తారు. రేపు ముకర్రం జాకు నివాళులర్పించేందుకు సాధారణ ప్రజలకు అనుమతిస్తారు. రేపు పాతబస్తీలో మక్కా మసీదు ప్రాంగణంలోని అసఫ్ జాహి సమాధుల దగ్గర ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం 3.30 నిమిషాలకు చౌమహల్లా ప్యాలెస్ నుంచి ఆయన అంతిమయాత్ర ప్రారంభంకానుంది. మిర్ బర్కత్ అలీ ఖాన్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూలి తెలిపారని సీఎంవో ఓ ప్రకటనలో పేర్కొంది.

Mukarram Jah Dies In Turkey: 8వ నిజాం నవాబ్ ముకర్రం జా కన్నుమూత.. రేపు హైదరాబాద్‌లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

నిజాం వారసుడిగా మిర్ బర్కత్ అలీ ఖాన్ పేదప్రజలకు చేసిన సేవతో పాటు విద్య, వైద్య రంగాలకు అందించిన సాయం గొప్పదని, ఆయన అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరిపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి కేసీఆర్ ఆదేశించారని సీఎంవో తెలిపింది. ముకర్రం జా అంత్యక్రియలను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు ప్రకటించడంపై వీహెచ్ పీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రజలను, మహిళలను అవమానించి, ఇబ్బందులకు గురిచేసిన ఆయన అంత్యక్రియలను అధికారికంతా ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.

దీనిపై నిజాం కుబుంబ సభ్యులు, నిజాం ట్రస్టుల సభ్యులు స్పందించలేదు. పాతబస్తీలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ 8వ నిజాం నవాబ్ మీర్ బర్కత్ అలీ ఖాన్ వాలాషన్ ముకర్రం జా బహదూర్ (89) కన్ను మూశారని ఆయన ఆఫీసు ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. 1933లో జన్మించిన మిర్ బర్కత్ అలీ ఖాన్.. కుటుంబంతో సహా టర్కీలో నివాసం ఉంటున్నారు. ఇస్తాంబుల్‌ లో ఆయన మొన్న రాత్రి 10.30 గంటలకు కన్నుమూశారు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కు మిర్ బర్కత్ అలీ ఖాన్ మనవడు.