Rythu Bandhu : రైతుబంధు 8వ విడత.. రైతుల ఖాతాల్లోకి రూ.7వేల 645 కోట్లు

తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతుబంధు పథకం డబ్బులను ఈ నెల 28 నుంచి పంపిణీ చేయనుంది. ప్రస్తుతం యాసంగి సీజన్ కి సంబంధించి..

Rythu Bandhu : రైతుబంధు 8వ విడత.. రైతుల ఖాతాల్లోకి రూ.7వేల 645 కోట్లు

Rythu Bandhu

Rythu Bandhu : తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతుబంధు పథకం డబ్బులను ఈ నెల 28 నుంచి పంపిణీ చేయనుంది. ప్రస్తుతం యాసంగి సీజన్ కి సంబంధించి రైతుబంధు కోసం రూ.7వేల 600 కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఏడు విడతల్లో రూ.43వేల 036.63 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ చేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ 8వ సీజన్ తో కలుపుకుని మొత్తం రూ.50వేల కోట్లు రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు.

Major Financial Works : డిసెంబర్ 31లోగా ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే నష్టపోతారు..

10వ తేదీ డిసెంబర్ నాటికి ధరణి పోర్టల్ లో పట్టాదారులు, కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా అందిన ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు రైతబంధుకి అర్హులు అని మంత్రి చెప్పారు. ఈ సీజన్ లో 66.61 లక్షల మంది రైతులకు గాను 152.91 లక్షల ఎకరాలకు రూ.7వేల 645.66 కోట్లు జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. దీనిలో 3.05 లక్షల ఎకరాలకు గాను 94వేల మంది రైతులు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారుల గుర్తింపు ఉంది.

Covid Booster Dose : కోవిడ్ బూస్టర్ డోసుకు మీరు అర్హులేనా? ఇలా తెలుసుకోండి..!

తొలుత ఎకరా భూమి ఉన్న రైతుల ఖాతాలో, ఆ తర్వాత 2 ఎకరాలు.. ఆ తర్వాత 2 నుంచి 3 ఎకరాలు ఇలా విస్తీర్ణం చొప్పున రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. రైతుబంధు పథకాన్ని ప్రపంచంలోని అత్యుత్తమ 20 పథకాల్లో ఒకటిగా రోమ్ లో 2018 నవంబర్ లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఎఫ్ఎఓ గుర్తించిందని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు.